చెరువు కత్వను, కబ్జాదార్ల నుండి రక్షించాలి..

ఎఫ్.టి.ఎల్, బప్పర్ జోన్లలో భారీగా రోడ్లు వేయరాదు...

On
చెరువు కత్వను, కబ్జాదార్ల నుండి రక్షించాలి..

చెరువు కత్వను, కబ్జాదార్ల నుండి రక్షించాలి..

ఎఫ్.టి.ఎల్, బప్పర్ జోన్లలో భారీగా రోడ్లు వేయరాదు...

IMG-20250411-WA1616
ఎఫ్.టి.ఎల్, బప్పర్ జోన్లలో భారీగా రోడ్లును పరిశీలిస్తున్న సిపిఎం నాయకులు..

సిపిఎం పార్టీ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య...

ఎల్బీనగర్, ఏప్రిల్ 11, న్యూస్ ఇండియా ప్రతినిధి: అబ్దుల్లాపూర్మెట్టు మండలం అనాజ్ పూర్ గ్రామంలో జీనియస్ డెవలప్మెంట్ రియల్ ఎస్టేట్ వాళ్లు వేముల కత్వ, ఇంద్రమ్మ సాగర్ ఈ రెండు చెరువులలో రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఎఫ్.టి.ఎల్, బప్పర్ జోన్లలో భారీగా రోడ్లు వేస్తున్న దాన్ని వ్యతిరేకిస్తూ పర్యావరణాన్ని రక్షించాలని చెరువు కత్వను, కబ్జాదార్ల నుండి రక్షించాలని, సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో వాటిని సందర్శించి, ఇరిగేషన్ అధికారులను, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులను పిలిపించి అక్కడ జరుగుతున్న పనులను ఆపివేయడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య మాట్లాడుతూ, జీనియస్ డెవలప్మెంట్ రియల్ ఎస్టేట్  వ్యాపారస్తులు, 300 ఎకరాల భూమిని చదును చేస్తూ అందులో విల్లాస్ నిర్మించాలని చూస్తున్న దానికి, ఈ డెవలప్మెంట్ పనులకి నాలా కన్వెన్షన్ గాని, హెచ్ఎండిఏ పర్మిషన్ గాని, మైనింగ్, ఇరిగేషన్ అధికారుల నుండి ఎటువంటి పర్మిషన్ లేకుండా పెద్ద పెద్ద గుట్టల్ని బ్లాస్టింగ్ చేస్తూ, గ్రామస్తులకు పెద్ద పెద్ద ధ్వనులతో పర్యావరణానికి హాని కలిగిస్తున్నారనీ అన్నారు. ఆ గ్రామానికి జీవన ఆధారమైన ఇంద్రిమ్మ సాగర్, పైన ఉన్న వేముల కత్వా ను ఇప్పటికే ఒకపక్క ఫిలింసిటీ యాజమాన్యం ఎఫ్టిఎల్ నుండి భారీ భారీ గోడ నిర్మించింది. ఇప్పుడు చదును చేస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఎఫ్.టి.ఎల్, బప్పర్ జోన్లో గుట్టలను పగలదీసి పెద్ద పెద్ద రాళ్లతో చెరువులో పోసి నిబంధనలకు వ్యతిరేకంగా భారీ రోడ్డు వేస్తున్నారు. రెవెన్యూ అధికారులు ఇరిగేషన్ అధికారులు, ఏమి చేయకుండా, మామూళ్లకు ఆశపడి, చెరువుకుంటలని కబ్జా చేస్తున్నారు. ఈ వెంచర్ యాజమాన్యం కాంగ్రెస్ ప్రభుత్వ అండతో విచ్చలవిడిగా కబ్జాలు చేస్తున్నారని అటువైపు ఎవరైనా వస్తే బెదిరిస్తున్నారని అధికారులను సైతం బెదిరిస్తూ ప్రలోభాలకు గురి చేస్తూ ఇష్టం వచ్చినట్లుగా ఎవరి నుంచి ఎటువంటి పర్మిషన్ లేకుండా డెవలప్మెంట్ చేస్తున్నారు. కావున అధికారులు స్పందించి ఎఫ్టిఎల్, బప్పర్ జోన్లో అక్రమంగా రోడ్డు వేస్తున్న వారిపై చర్యలు తీసుకొని వాటిని రక్షించాలని సిపిఎం పార్టీ అబ్దుల్లాపూర్మెట్ మండల కార్యదర్శి ఏర్పుల నరసింహ డిమాండ్ చేశారు. లేనిచో రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఎంతటి పెద్దవారైనా వదిలిపెట్టింది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల నాయకులు వర్గాల ముత్యాలు, కావలి జంగయ్య, గుండె శివకుమార్, మహేశ్వరం లింగ స్వామి, పి. శ్రీనివాస్ గ్రామ రైతులు, వెంకటేష్ మహేష్ బాల్రాజ్, ఐలయ్య, ప్రణయ్, అనాజ్ పూర్ గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు.

Read More ఉగ్రవాదం పై కఠిన చర్యలు తీసుకోవాలి.

Views: 63

About The Author

Post Comment

Comment List

Latest News

ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు. ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు.
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, మే 08, న్యూస్ ఇండియా : ఆర్యవైశ్యుల కుల దైవం సంగారెడ్డి పట్టణ శివారులోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయంలో బుధవారం...
ఉగ్రవాదం పై కఠిన చర్యలు తీసుకోవాలి.
‘రక్త సిందూరం’ ప్రతీకార చర్యలు భేష్.
సమాచారం ఇవ్వని అసమర్థ అధికారులు.!
శబ్ద కాలుష్యం భరించలేక పోతున్నాం!
చలివేంద్రం ఏర్పాటు
హత్నూర, గుమ్మడిదల పోలీసు స్టేషన్ల ఆకస్మిక తనిఖీ.