భూ భారతి రెవెన్యూ సదస్సులలో వచ్చిన భూ సమస్యలను త్వరిత గతిన పరిష్కరించాలి. -జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు

On
భూ భారతి రెవెన్యూ సదస్సులలో వచ్చిన భూ సమస్యలను త్వరిత గతిన పరిష్కరించాలి.   -జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు

సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, మే 09, న్యూస్ ఇండియా : జిల్లా భూ భారతి పైలట్ ప్రాజెక్ట్ రెవెన్యూ సదస్సులలో భాగంగా శుక్రవారం జిల్లా కొండాపూర్ మండలం, గొల్లపల్లి,  గ్రామం లో నిర్వహించిన సదస్సులో కలెక్టర్ క్రాంతి వల్లూరు పాల్గొన్నారు. సదస్సుకు హాజరైన రైతులతో భేటీ అయ్యి, వారు ఎదుర్కొంటున్న భూ సంబంధిత సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. రైతు గుర్తింపు కార్డుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ, హెల్ప్ డెస్క్, దరఖాస్తుల స్వీకరణ కౌంటర్ వద్ద సదుపాయాలు, సిబ్బంది పనితీరును కలెక్టర్ పరిశీలన జరిపి, అధికారులకు సూచనలు చేశారు. రైతు లు సమర్పించిన దరఖాస్తులో  భూ సమస్యలను పేర్కొనే సమయంలో వాటిని క్షుణ్ణంగా పరిశీలిస్తూ, ఆన్లైన్ లో జాగ్రత్తగా ఎంట్రీ చేయాలని అన్నారు. వివరాల నమోదులో తప్పిదాలకు ఆస్కారం కల్పించకూడదని, ఏవైనా సందేహాలు ఉంటే సంబంధిత రెవెన్యూ అధికారులను సంప్రదించి నివృత్తి చేసుకోవాలని డేటా ఎంట్రీ ఆపరేటర్లకు హితవు పలికారు. దరఖాస్తుల పరిశీలన ఆన్లైన్ నమోదు ప్రక్రియలపై పరిపూర్ణమైన అవగాహన ఏర్పర్చుకోవాలని అన్నారు. భూ రికార్డులలోని వివరాలను పక్కాగా సేకరిస్తూ, ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. భూ సమస్యల శాశ్వత పరిష్కారమే ధ్యేయంగా ప్రభుత్వం 18 రాష్ట్రాలలో సమగ్ర అధ్యయనం జరిపి, నూతన ఆర్.ఓ.ఆర్ చట్టం అమలులోకి తెచ్చిందని అన్నారు. ప్రస్తుతం పైలెట్ ప్రాతిపదికన  కొండాపూర్ మండలంలోని ఆయా గ్రామాలలో నిర్వహించిన రెవెన్యూ సదస్సుల సందర్భంగా వచ్చిన ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి,  క్షేత్రస్థాయిలో విచారణ జరిపి, నిర్ణీత గడువు లోపు పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. వివిధ కారణాల వల్ల రెవెన్యూ సదస్సులో అర్జీలు సమర్పించే అవకాశం లభించని వారు తరువాత కూడా దరఖాస్తు చేసుకోవచ్చని, అధికారులు అందుబాటులో ఉండి అర్జీలు స్వీకరిస్తారని తెలిపారు. భూ రికార్డులలో పేరు తప్పుగా ఉండడం, విస్తీర్ణం హెచ్చు తగ్గులు, వారసత్వ భూములు, భూ స్వభావంలో మార్పులు, నిషేధిత జాబితాలో ఉన్న భూ సమస్యలు, సర్వే నెంబర్ మిస్సింగ్, పట్టా పాస్ బుక్కులు లేకపోవడం, ప్రభుత్వ భూములను నవీకరించడం, సాదాబైనామా కేసులు, హద్దుల నిర్ధారణ, పార్ట్-బి లో చేర్చిన భూముల సమస్యలు, భూసేకరణ కేసులు తదితర వాటికి సంబంధించిన దరఖాస్తులు స్వీకరించి భూభారతి చట్టంలో పొందుపర్చిన మార్గదర్శకాల ప్రకారం పరిష్కరించేలా రెవెన్యూ బృందాలకు మార్గనిర్దేశం చేశామని కలెక్టర్ తెలిపారు. పైలట్ ప్రాజెక్టు కింద కొండాపూర్ మండలంలో రెవెన్యూ సదస్సులలో వచ్చిన దరఖాస్తులను పరిష్కరించిన మీదట, జిల్లాలోని మిగితా మండలాల్లో  రెవెన్యూ గ్రామాల వారీగా సదస్సులు నిర్వహిస్తామని పేర్కొన్నారు. రైతులు రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకుని భూ సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. అంతకుముందు కొండాపూర్ మండలం  తహసీల్దార్ కార్యాలయంలో  ఆకస్మిక తనిఖీ చేశారు. రెవెన్యూ సదస్సులలో వచ్చిన దరఖాస్తులఆన్లైన్ నమోదు ప్రక్రియ ను పరిశీలించారు. రెవెన్యూ రికార్డులను పరిశీలించారు. ఈ సదస్సులలో ఆర్డిఓ రవీందర్ రెడ్డి, రెవెన్యూ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.WhatsApp Image 2025-05-09 at 3.55.19 PM

Views: 2
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

ఇస్నాపూర్ లో చిరు వ్యాపారులను 'ఛిద్రం' చేస్తున్న తై -బజార్.!!! ఇస్నాపూర్ లో చిరు వ్యాపారులను 'ఛిద్రం' చేస్తున్న తై -బజార్.!!!
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, మే 09, న్యూస్ ఇండియా : ఇస్నాపూర్ మునిసిపాలిటీ లోని ఇస్నాపూర్, చిట్కుల్, పాశమైలారం గ్రామాలలో లో చిరు వ్యాపారుల దగ్గర...
అక్రమ గంజాయి రవాణా పై సంగారెడ్డి జిల్లా పోలీసుల ఉక్కు పాదం.
మిల్లుల వద్ద ధాన్యం దిగుమతిలో జాప్యానికి తావులేకుండా చర్యలు.
భూ భారతి రెవెన్యూ సదస్సులలో వచ్చిన భూ సమస్యలను త్వరిత గతిన పరిష్కరించాలి. -జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు
సంగారెడ్డి పోతిరెడ్డి పల్లి లో ‘రూ.10 లక్షల గంజాయి పట్టివేత’.
ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు.
ఉగ్రవాదం పై కఠిన చర్యలు తీసుకోవాలి.