అక్రమ గంజాయి రవాణా పై సంగారెడ్డి జిల్లా పోలీసుల ఉక్కు పాదం.

సిసియస్, పటాన్ చెర్వు పోలీసుల సంయుక్త ఆపరేషన్ లో సుమారు 27 లక్షల విలువ గల, 106 కిలోల నిషేదిత ఎండు గంజాయి సీజ్. సిసియస్, పటాన్ చెర్వు పోలీసులను అభినందించిన జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్.

On
అక్రమ గంజాయి రవాణా పై సంగారెడ్డి జిల్లా పోలీసుల ఉక్కు పాదం.

సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, మే 09, న్యూస్ ఇండియా : నమ్మదగిన సమాచారం మేరకు తేది: 08.05.2025 నాడు ఉదయం అందాజ 11:00 గంటల సమయంలో సిసియస్ టీం, పటాన్చెర్వు ఇన్స్పెక్టర్ వినాయక్ రెడ్డి తన సిబ్బందితో కలిసి ఔటర్ రింగ్ రోడ్డు ఎగ్జిట్ నెంబర్ -3 టోల్ గెట్ వద్ద వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా సంగారెడ్డి వైపు అనుమానాస్పదంగా వస్తున్న రెండు కార్లు (1) మారుతి స్విఫ్ట్ కార్ నెంబర్ టీఎస్ 15 ఎఫ్ హెచ్ 3441, (2) మారుతి బెల్లెనో కార్ నెంబర్ టీఎస్ 09 జి ఏ 6422  గల వాటిని ఆపి తనిఖీ చేయగా అట్టి రెండు కార్ల డిక్కిలలో గోదుమ రంగు కవర్ చుట్టిన 54  ( 54 * 2=106 కిలోల) ఎండుగంజాయి ప్యాకెట్స్  కనిపించినవి అని తెలియచేసారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ... నిందితులు తప్పుడు మార్గంలో డబ్బులు సంపాదించాలని నిర్ణహించుకొని, అస్సాం, ఒరిస్సా బార్డర్ నుండి ఎండుగంజాయిని అక్రమంగా రవాణా చేస్తూ.. కర్ణాటక, మహారాష్ట్రా లలో అమ్మే ప్రయత్నం చేశారని తెలియజేశారు. అమ్మడానికి వెళుతుండగా మార్గమద్యలో వాహనాల తనిఖీ నిర్వహిస్తున్న సిసియస్ టీం, పటాన్చెర్వు పోలీసులు పై నాలుగు నిందితులను అదుపులోనికి తీసుకొని, ఎండుగంజాయి 54 ప్యాకెట్స్, నేరానికి వినియోగించిన 2-కార్లు, సెల్ ఫోన్ సీజ్ చేయడం జరిగిందని, నిందితున్ని రిమాండుకు తరలించారని తెలియచేసారు. జిల్లాలో మాదక ద్రవ్యాల దుర్వినియోగంపై జిల్లా పోలీసు శాఖ ఉక్కు పాదం మోపడం జరుగుతుందని, ఎవరైనా గంజాయి లేదా ఇతర మాదక ద్రవ్యాలను సాగు, సరఫరా చేసిన సంగారెడ్డి జిల్లా ఎస్ -నాబ్ నెంబర్ 8712656777 కు సమాచారం అందించాలని, సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు.  ఇట్టి గంజాయి అక్రమ రావాణ ఛేదనలో కీలకంగా వ్యవహరించిన అధికారులను, సిబ్బందిని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్ అభినందించారు.WhatsApp Image 2025-05-09 at 7.39.41 PM

Views: 11
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

హెల్మెట్ పెట్టుకొని వాహనం నడుపుతానని ప్రతిజ్ఞ చేస్తున్న హెల్మెట్ పెట్టుకొని వాహనం నడుపుతానని ప్రతిజ్ఞ చేస్తున్న
డోర్నకల్ ఏప్రిల్ 14 న్యూస్: డోర్నకల్ మండలం వెన్నారం గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్135 జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.గ్రామ సర్పంచ్ జక్కుల కౌసల్య అంబేద్కర్ విగ్రహానికి...
ఇంటర్ ఫలితాలలో వెలాసిటీ కళాశాల విజయకేతనం
ఖమ్మంలో వెలాసిటీ కళాశాలలో ఎదురులేని ఫలితాలు
మహిళ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా కళాశాల వార్షికోత్సవ వేడుకలు
ఆపదలో ఆపన్నహస్తం....!!
యువ నాయకత్వానికి ప్రతీక బంటి అన్న..
ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి ఉత్సవాలు..