శవాలతో కూడా యుద్ధం చేస్తారా..? 

శవాలు అప్పగించకుండా ఆనవాళ్లు, సాక్ష్యాలు తారుమారు చేసే కుట్ర..?  -- మృతదేహాలను అప్పగించి అంత్యక్రియలు జరిగేలా చూడాలి

On
శవాలతో కూడా యుద్ధం చేస్తారా..? 

సీపీఐ (ఎంఎల్) మాన్ లైన్ (ప్రజాపంథా) కేంద్ర కమిటీ సహాయ కార్యదర్శి, తెలంగాణా రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు

 మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు, ఇతర తెలుగు రాష్ట్రాల నేతలు మే 21 నాడు జరిగిన ఎన్ కౌంటర్ లో మృతి చెంది 6 రోజులైనా బంధువులకు వారి మృతదేహాలను అప్పగించక పోవడం కేంద్ర, రాష్ట్ర బీజేపీ, ఏపీ కూటమి ప్రభుత్వ ఫాసిస్టు దుర్మార్గానికి నిదర్శనమని, బీజేపీ, టీడీపీ సర్కార్లు చచ్చిన శవాలకు కూడా భయపడి, శవాలతో యుద్ధం చేస్తున్నాయని సీపీఐ (ఎం.ఎల్) మాన్ లైన్ (ప్రజాపంథా) కేంద్ర కమిటీ సహాయ కార్యదర్శి, తెలంగాణా రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు దుయ్యాబట్టారు.

సీపీఐ (ఎం.ఎల్) మాన్ లైన్ (ప్రజాపంథా) జిల్లా కార్యాలయంలో సోమవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆ సంఘం కేంద్ర కమిటీ సహాయ కార్యదర్శి, తెలంగాణా రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు మాట్లాడుతూ.. ఇప్పటికైనా మృత దేహాలను బంధువులకు అప్పగించాలని, అంత్యక్రియలు గౌరవప్రదంగా జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. నిర్బంధం, బెదిరింపులు ఆపాలని డిమాండ్ చేశారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన వారి మృతదేహాలను అప్పగించడానికి 6 రోజులుగా అలస్యం చేయడములో ఆనవాళ్లు, సాక్ష్యాలను కనిపించకుండా చేసే కుట్ర ఉందని ఆరోపించారు. ప్రభుత్వాల, పోలిసుల ఈ దుర్మార్గ వైఖరి చూస్తే పట్టుకువచ్చి కాల్చి చంపినట్లు వచ్చే వార్తలను విశ్వసించేలా ఉందని ఆరోపించారు. మధ్య భారతంలో నరమేధం సృష్టిస్తున్నారని, సరిహద్దులలో చేసే యుద్ధం దండకారణ్యంలో చేస్తున్నారని, బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఫాసిస్టు విధానంలో భాగంగానే ఇది జరుగుతున్నదని అన్నారు. అక్కడ దొరికే 29 రకాల విలువైన ఖనిజాలా కోసం కార్పొరేట్ కంపెనీల లాభాల దాహం కోసం ఈ నరమేధం చేస్తూ, రక్త పీపాసులుగా మారారని ఆరోపించారు. ఇప్పటికైనా నరమేధం ఆపి, శాంతి చర్చలు జరపాలని, శవాలను బంధువులకు అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు. సుప్రీం కోర్టు జోక్యం చేసుకొని, నరమేధం ఆపాలని, ఎన్కౌంటర్ లపై, ఆదివాసుల మరణాలపై న్యాయవిచారణ జరపాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర నాయకుడు గోకినేపల్లి వెంకటేశ్వర్రావు మాట్లాడుతూ.. మాజీ శాసన సభ్యులు గుమ్మడి నర్సయ్యని, ఇతర రాజకీయ, ప్రజాసంఘాల నేతలను జియానపేట పోనియకుండా అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండిచారు. అలానే జిల్లాలో, రాష్ట్రంలో పోడు భూములకు ఇంకా అన్నింటికీ పట్టాలు ఇవ్వలేదని, అలానే వారికి అన్ని రకాల రుణాలు, సౌకర్యాలను కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ విలేకరుల సమావేశంలో నాయకులు గుర్రం అచ్చయ్య, ఆవుల వెంకటేశ్వర్లు, గండమళ్ళ రామయ్య, ఝాన్సీ, మలీదు నాగేశ్వర్ రావులు పాల్గొన్నారు.

Views: 17
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

పేద ప్రజలకు అరుదైన వైద్యం శ్రీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పేద ప్రజలకు అరుదైన వైద్యం శ్రీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్
ఖమ్మం మే 1 ఖమ్మం న్యూస్ ప్రతినిధి: ప్రస్తుతం ఉన్న కాలంలో వైద్యం అంటే ప్రజలు అడలెత్తిపోతున్నారు.వైద్యం పేరుతో కార్పోరేట్ వ్యవస్థ పేద ప్రజలను పట్టిపీడిస్తున్నాయి.ఖమ్మం నగరంలో...
కేసరిగుట్టలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం ఘనంగా
పది ఫలితాలలో త్రివేణి ప్రభంజనం
కలెక్టరేట్లో ఘనంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతోత్సవాలు 
జిల్లా వ్యాప్తంగా పోలీసుల నాకాబందీ
ఆర్టీసీలో సమ్మె సైరన్ 
ఆర్టీసీలో సమ్మె సైరన్