సర్పంచుల పెండింగ్ బిల్లులు అడిగితే.. అక్రమ అరెస్టులా??

రాష్ట్ర సర్పంచుల సంఘం ఉపాధ్యక్షుడు గంగిరెడ్డి బల్వంత్ రెడ్డి..

On
సర్పంచుల పెండింగ్ బిల్లులు అడిగితే.. అక్రమ అరెస్టులా??

సర్పంచుల పెండింగ్ బిల్లులు అడిగితే.. అక్రమ అరెస్టులా??

రాష్ట్ర సర్పంచుల సంఘం ఉపాధ్యక్షుడు గంగిరెడ్డి బల్వంత్ రెడ్డి..

IMG-20250527-WA0423
రాష్ట్ర సర్పంచుల సంఘం ఉపాధ్యక్షుడు గంగిరెడ్డి బల్వంత్ రెడ్డి..

రంగారెడ్డి జిల్లా, మే 27, న్యూస్ ఇండియా ప్రతినిధి: తెలంగాణ వ్యాప్తంగా గ్రామపంచాయతీలలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి అప్పుల పాలైన మాజీ సర్పంచుల బాధలు వర్ణనాతీతమని సర్పంచుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాజీ సర్పంచ్ రాయపోల్ గంగిరెడ్డి బల్వంత్ రెడ్డి, మాజీ సర్పంచ్ తులే కలాన్ సర్పంచ్ చిలకల యాదగిరి  అన్నారు. గ్రామాలలో అనేక అభివృద్ధి పనులు చేసి దేశంలోనే ఆదర్శవంతమైన గ్రామపంచాయతీలుగా తీర్చిదిద్దిన సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించాలని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే, అక్రమ అరెస్టులు, గృహనిర్బంధాలు చేయడం హేయమైన చర్య అని అన్నారు.పెండింగ్ బిల్లులు ఇవ్వాలని ఏడాదిన్నర కాలంగా అడిగినా ఇవ్వకపోవడం సిగ్గుచేటు అని రాష్ట్రవ్యాప్తంగా ఆయాగ్రామలలో సర్పంచులు చేసిన అభివృద్ధి పనులకు సంబంధించిన 1200 కోట్ల రూపాయలు వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.సర్పంచుల కుంటుంబాలు రోడ్డున పడే దాకా ప్రభుత్వం స్పందించదా అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు ఇబ్రహీంపట్నం  పోలీసు స్టేషన్ కు తరలించడం దారుణమని అన్నారు.వందల కోట్ల రూపాయల బకాయిలు ఉంటే 153 కోట్లు విడుదల చేసి చేతులు దులుపుకోవడం ఏమిటని ప్రశ్నించారు. సర్పంచుల పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేసి ఆ తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.  అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని, పెండింగ్ బిల్లులు విడుదల చేసేంతవరకు సర్పంచుల పోరాటం ఆగదని ఆయన తెలిపారు.

Views: 78

About The Author

Post Comment

Comment List

Latest News

పెద్దకడుబూరు మండలం : వైసీపీ పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేస్తాం..!  పెద్దకడుబూరు మండలం : వైసీపీ పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేస్తాం..! 
వైసీపీ జిల్లా ఉపాధ్యక్షులు వై. ప్రదీప్ రెడ్డిని కలిసిన పెద్దకడుబూరు వైసీపీ నాయకులు.
పాల్వంచలోని విద్యా సంస్థల అధినేత కేఎల్ఆర్ చిరస్మరణీయుడు
పద్మ శ్రీ అవార్డు గ్రహీత మంద కృష్ణ మాదిగ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ఉప్పల్ ఎమ్మెల్యే
#Draft: Add కూటమితోనే అభివృద్ధి సాధ్యం: ఆలూరు టీడీపీ ఇన్ఛార్జిYour Title
ఎల్బీనగర్ సైబర్ వారియర్ కు రాచకొండ కమిషనర్ ప్రశంస..
కూటమి పాలనలో రెడ్ బుక్ రాజ్యాంగం - జగనన్న 2.0 ఏంటో మేము చూపిస్తాం... ఎమ్మెల్యే వై. బాలనాగి రెడ్డి.
పెద్దకడుబూరు : మహనీయుని స్మరణలో ఘనంగా వైఎస్ఆర్ 76వ జయంతి వేడుకలు..!