యువత స్వయం ఉపాధి మార్గాలను ఎంచుకొని ఆర్థికంగా ఎదగాలి..
మాజీ సర్పంచ్ కొంగర విష్ణువర్ధన్ రెడ్డి..

యువత స్వయం ఉపాధి మార్గాలను ఎంచుకొని ఆర్థికంగా ఎదగాలి

మాజీ సర్పంచ్ కొంగర విష్ణువర్ధన్ రెడ్డి..
ఆరుట్లలో స్కై ఫైవ్ (SKY 5) ఫోటో స్టూడియో ప్రారంభం
రంగారెడ్డి జిల్లా, మంచాల, మే 31, న్యూస్ ఇండియా ప్రతినిధి: యువత స్వయం ఉపాధి మార్గాలను ఎంచుకొని ఆర్థికంగా ఎదగాలని ఆరుట్ల మాజీ సర్పంచ్ కొంగర విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. శనివారం ఆరుట్ల గ్రామంలో బైకని శ్రీకాంత్ యాదవ్ ఏర్పాటు చేసిన SKY 5 ఫోటో స్టూడియోను ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. యువత చెడు మార్గంలో వెళ్లకుండా తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని ఏదైనా రంగాన్ని ఎంచుకొని ఆయా రంగాల్లో ఉన్నతంగా రాణించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ్ పాండాల జంగయ్య గౌడ్, గ్రామస్తులు మాడ్గుల కృష్ణ, మార సురేష్, ఎన్నిదుల సురేష్, వస్పరి కుమార్, దాసరమోని రమేష్, చెరుకు నర్సింహా, కంబాలపల్లి బుగ్గరాములు, దాసరమోని అశోక్, బైకని జంగయ్య, బైకని ఐలయ్య, సిద్దగోని రమేష్, నూకం జంగయ్య, బైకని అరుణ్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
About The Author
Related Posts
Post Comment
Latest News

Comment List