టీఆర్ఎస్ నేతలపై నాన్ బెయిలబుల్ కేసులు
తెలంగాణలో టీఆర్ఎస్ బీజేపీ మధ్య యుద్ధం మొదలైంది.ఇప్పటివరకు మాటల వరకే పరిమితమైన పోరు.. ఇప్పుడు డైరెక్ట్ ఫైట్ కు దారి తీసింది. బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఇంటిపై దాడి చేసిన వారిలో 8 మందిపై పోలీసులు నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారు.అంతకు ముందు దాడి ఘటనపై ఎంపీ అర్వింద్ తల్లి విజయలక్ష్మి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉదయం 50 మంది టిఆర్ఎస్ కార్యకర్తలు తమ ఇంటిపై దాడి చేశారని ఫిర్యాదు చేశారు. ఘటనలో ఇంట్లో […]
తెలంగాణలో టీఆర్ఎస్ బీజేపీ మధ్య యుద్ధం మొదలైంది.ఇప్పటివరకు మాటల వరకే పరిమితమైన పోరు.. ఇప్పుడు డైరెక్ట్ ఫైట్ కు దారి తీసింది.
బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఇంటిపై దాడి చేసిన వారిలో 8 మందిపై పోలీసులు నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారు.అంతకు ముందు దాడి ఘటనపై ఎంపీ అర్వింద్ తల్లి విజయలక్ష్మి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఉదయం 50 మంది టిఆర్ఎస్ కార్యకర్తలు తమ ఇంటిపై దాడి చేశారని ఫిర్యాదు చేశారు.
ఘటనలో ఇంట్లో పని చేస్తున్న సత్యవతి, సెక్యూరిటీ గార్డ్ రమణ గాయపడ్డారని చెప్పారు. బెంజ్ కార్ అద్దాలు ధ్వంసం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
50 మంది టిఆర్ఎస్ పార్టీ నాయకులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
మరోవైపు ఎంపీ అర్వింద్ నివాసంపై టిఆర్ఎస్ కార్యకర్తల దాడికి నిరసనగా తెలంగాణలో పలు చోట్ల బీజేపీ కార్యకర్తలు ఆందోళనలు చేపట్టారు.
కేసీఆర్ దిష్టిబొమ్మలు తగులబెట్టారు. కేసీఆర్, కేటీఆర్, కవితలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
About The Author

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Comment List