సంగారెడ్డి 'బెల్టు షాపుల్లో' మద్యం అమ్మకాలు!
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, ఆగస్టు 25, న్యూస్ ఇండియా : స్వతంత్ర దినం ‘15 ఆగస్టు’ వేడుకల దినం సైతం అడ్డగోలుగా మద్యం అమ్మకాలు జరుగుతున్నా విషయం తెలిసిన సంగారెడ్డి అబ్కారీశాఖ చర్యలు తీసుకోకపోవడం ప్రజలను ఆశ్చర్యానికి గురిచేసింది. ఇవి అధికారిక వ్యవస్థ ద్వారా అనుమతులు పొందిన వ్యాపారా దుకాణాలకు సమాంతర అమ్మకాలు జరుగుతాయంటే అతిశయోక్తి కాదేమో.? పెద్ద సిండికేట్లతో ముడిపడి ఉన్న ఈ దుకాణాలు ప్రభుత్వ తీసుకొనే చర్యలు మాత్రం ఏమాత్రం ప్రభావం చూపలేని బలహీనస్థితులో ఉండడం ప్రజలు చేసుకొన్నా దురదృష్టం అని చెప్పుకోవచ్చు. సామాజిక వ్యతిరేక విధానాలపై కార్యకలాపాలు చేస్తుంటే ఎలాంటి సంబంధం లేనట్టు ఆబ్కారీ శాఖ చర్యలు తీసుకోకపోవడం ప్రజలకు ఆందోళన కలిగించే విషయమే. జిల్లా కేంద్రం అయినా సంగారెడ్డి పట్టణంలోనే ఈలాంటి పరిస్థితులు వున్నాయంటే గ్రామాల మాట దేవుడెరుగు.! ఈ అడ్డగోలు అమ్మకాలను 'సంగారెడ్డి జిల్లా ఆబ్కారీ శాఖ సంబంధిత అధికారులు' అదుపుచేస్తారో.. ? తూతూ మంత్రంగా పనిచేసి చేతులు దులుపుకొంటారో..? కాలమే సమాధానము చెపుతుంది.
Comment List