ఆటోని ఢీ కొట్టిన టిప్పర్
ఆటో డ్రైవర్ మృతి
On
కొత్తగూడెం (న్యూస్ ఇండియా బ్యూరో నరేష్): చుంచుపల్లి మండలం అంబేద్కర్ పంచాయతీ ప్రధాన రోడ్డుపై ఆటోను టిప్పర్ ఢీ కొట్టింది. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... అంబేద్కర్ పంచాయతీకి చెందిన మంగళగిరి శేషగిరిరావు (38)TS04UE3459 నెంబర్ గల తన ఆటోని రోడ్డు పక్కన నుంచి అద్దాలు శుభ్రం చేస్తుండగా, బొగ్గు టిప్పర్(TS04UC3573 )సత్తుపల్లి ఓసి నుంచి కొత్తగూడెం జేకేఓసికి అతివేగంగా వచ్చి ఆటోను ఢీకొట్టగా ఆటో డ్రైవర్ శేషగిరిరావు కు తీవ్ర గాయాలు కాగా ఆస్పత్రికి తరలించగా మృతి చెందాడు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుడికి భార్య,ఇద్దరు పిల్లలు ఉన్నారు. టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Views: 105
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
27 Aug 2025 18:01:56
• లోతట్టు ప్రాంతాలలో నివాసం ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..
• అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయకూడదు..
• జలాశయాలు, వాగులు, వంకలను చూడటానికి వెళ్లకూడదు..
•...
Comment List