జవహర్ నగర్ లో జవహర్ నగర్ కోర్ట్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయాలి
న్యాయవాది కుర్ర పుణ్యరాజు, జవహర్ నగర్ కోర్టు సాధన సమితి
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ టి నరేష్
తెలంగాణ రాష్ట్ర అవతరన అనంతరం పరిపాలన సౌలభ్యం కొరకు జిల్లాల మరియు మండలాల విస్తరణ జరిగిన విషయం మీ అందరికీ విదితమే. అందులో భాగంగా న్యాయ వ్యవస్థలో కుడా న్యాయస్థానాల విస్తరణ జరిగింది. ఎన్నో ఏళ్లుగా మన జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ ని కూడా మన జవహర్ నగర్ లో ఒక కొత్త కోర్టుని ఏర్పాటు చేయాలని ఎన్నోసార్లు చీఫ్ జస్టిస్ కి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. కానీ మేడ్చల్ లోని కొంతమంది న్యాయవాదులు వారి స్వలాభం కోసం జవహర్ నగర్ కు ప్రత్యేక కోర్టుని రాకుండా అడ్డుకున్నారు. జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ లో ప్రతి సంవత్సరం సుమారుగా 1500 నుండి 2000 వేల కేసులు రిజిస్టర్ అవుతాయి. ప్రతి కేసు కోర్టుకు వెళ్లాల్సిందే, ఆ కోర్టు జవహర్ నగర్ నుండి 35 నుండి 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.ఒక్క కేసులో 6 నుండి పదిమంది వరకు సాక్షులు ఉంటారు.ఆ సాక్షులను కోర్టుకు తీసుకు వెళ్ళవలసిన బాధ్యత పూర్తిగా మన పోలీసుల పైన మరియు ఫిర్యాదు దారుడు పైన ఉంటుంది.ఒక్కొక్కసారి కేసు ప్రొద్దున పిలిస్తే మళ్లీ సాయంత్రం పిలుస్తారు.పిలిచేంతవరకు ఆ సాక్షులు ఆ ఫిర్యాదుదారుడు అదే కోర్టు ప్రాంగణంలో ఉండవలసిన అవసరం ఉంటుంది.ఒక్కొక్కసారి సాక్షులు మేము వేచి ఉండలేము అని వెళ్ళిపోయే సందర్భాలు కోకోనలుగా ఉంటాయి.ఇలా అనేక చిన్న చిన్న విషయాలలో అటు పోలీసులకు గాని ఇటు సాక్షిదారులకు అనేక ఇబ్బందులకు గురి అవుతున్నారు.అదేవిధంగా జవహర్ నగర్ వాసులు మేడ్చల్ కోర్టు కు వెళ్ళడానికి డైరెక్ట్ బస్సు సౌకర్యం లేదు, జవహర్ నగర్ నుండి 2, 3 బస్సులు మారవలసి వస్తుంది. మనకు కోర్టులో ఏ చిన్న పని ఉన్న అంత దూరం ప్రయాణం చేయవలసి వస్తుంది. ఆ రోజు పూర్తిగా ఆ పని నిమిత్తం గడిచిపోతుంది.జవహరనగర్ పోలీస్ స్టేషన్ ఏర్పడక ముందు ఇప్పుడున్న జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొంత భాగం అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండేది మరియు కాప్రా, వంపుగూడ, సాకేత్ ప్రాంతాలు కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధి లో ఉండేవి. అదేవిదంగా దమ్మాయిగూడ మరియు చుట్టు ప్రక్కల కాలనీలు కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండేవి. మరియు వాటికీ సంబంధించిన కోర్టు పరిధి మల్కాజ్గిరి కోర్టు కు ఉండేది. ఆయా ప్రాంతాలవారికి అది కేవలం మూడు కిలోమీటర్ల దూరం మాత్రమే ఉండేది,అది అందరికి సౌకర్యం గా ఉండేది.ఇలా ప్రజల అవసరాల మేరకు మరియు రవాణా సౌకర్యాలను దృష్టిలో ఉంచుకొని కోర్టుల పరది ఏర్పాటు చేశారు ఇంకా చేస్తున్నారు. అందులో భాగంగానే రేపు దసరా సెలవుల తరువాత ప్రారంభం కానున్న "ఉప్పల్ కోర్టు కాంప్లెక్స్" ఈ కోర్టు పరిధిలోకి ఉప్పల్ పోలీస్ స్టేషన్, మేడిపల్లి పోలీస్ స్టేషన్, ఘట్కేసర్ పోలీస్ స్టేషన్, పోచారం పోలీస్ స్టేషన్, నాచారం పోలీస్ స్టేషన్ మరియు బోడుప్పల్ పోలీస్ స్టేషన్ లు వస్తాయి.ఈ యొక్క పోలీస్ స్టేషన్లో పరిధి ఇంతకుముందు రంగారెడ్డి మరియు మేడ్చల్- మల్కాజిగిరి కోర్టు కాంప్లెక్స్ లో పరిధిలో ఉండేవి ప్రత్యేక ఉప్పల్ కోర్టు కాంప్లెక్స్ ఏర్పాటు కొరకు అనేక సార్లు వినతి పత్రాలు ఇవ్వడం వలన ప్రత్యేక కోర్టు కాంప్లెక్స్ ఏర్పాటు జరిగింది.
అదేవిధంగా "జవహర్ నగర్ కోర్టు కాంప్లెక్స్" జవహర్ నగర్ లో ఏర్పాటు చేయాలని లేదా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధి కి సంబంధించిన కేసులకు ఒక ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేసి ఆ కోర్టును కుషాయిగూడ న్యాయస్థానల ప్రాంగణం లోనికి మార్చాలని మల్కాజ్గిరి న్యాయవాదుల బార్ అసోసియేషన్ మరియు పోలీస్ శాఖ కూడా చాలా సార్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి కి మరియు హైకోర్టు వారి దృష్టికి తీసుకొని వెళ్లడం జరిగింది,వారు కూడా సానుకూలంగా స్పందించినప్పటికీ ఇప్పటి వరకు సమస్యకు పరిష్కారం లభించలేదు. జవహర్ నగర్ కు సంబంధించి వేలాది కేసులు మేడ్చల్ కోర్టులో పెండింగ్ ఉన్నవి.ఇట్టి విషయంలో జవహర్ నగర్ లోని మేధావులు, కాలనీ అసోసియేషన్లు, కాలనీల పెద్దలు, వివిధ రాజకీయ పార్టీలు మరియు నాయకులు అందరూ పెద్ద ఎత్తున ఈ సమస్యపై జిల్లా న్యాయమూర్తికి మరియు హైకోర్టు రిజిస్టార్ కు సమస్య తీవ్రతను వివరిస్తూ వినతి పత్రాలు అందజేసే ఈ మహా యజ్ఞంలో పాలుపంచుకోవాలని మరియు జవహర్ నగర్ కోర్టు కాంప్లెక్స్ సాధన సమితి లో భాగస్వాములై జవహర్ నగర్ లో న్యాయస్థానం ఏర్పాటు పాటుపడతారని ఆశిస్తున్నాను. ఈ ప్రాంత ప్రజల ప్రధాన సమస్య గా దీన్ని భావించి దీనిపైన ఒక మంచి ఆర్టికల్ & స్టోరీ రాయవలసిందిగా విలేకరులను కోరుతున్నాను అని ఈ సందర్భంగా జవహర్ నగర్ కోర్టు సాధన సమితి న్యాయవాది కుర్ర పుణ్యరాజు తెలిపారు.
About The Author

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Comment List