బహదురుపల్లి ఎస్సి బస్తి లో అంబెడ్కర్ భవనానికి మరమ్మతులు....
నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి
కుత్బుల్లాపూర్ న్యూస్ ఇండియా ప్రతినిధి
బహదురుపల్లి ఎస్సి బస్తి లో అంబెడ్కర్ భవనానికి మరమ్మతులు....
- నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి....
కుత్బుల్లాపూర్ సెప్టెంబర్25
(న్యూస్ ఇండియా ప్రతినిధి )
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని బహదురుపల్లి ఎస్సి బస్తిలో అంబెడ్కర్ భవనం శిథిలమైన సందర్బంగా కిందటి వారం కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డిదృష్టికి తీసుకురాగా ఈ రోజు ఎస్సి కాలనీ లోని భవనాన్ని సందర్శించి సదురు అధికారులతో మాట్లాడి వీలైనంత త్వరలో మరమత్తులు చేయాలనీ తెలిపారు అనంతరం బస్తిలో మౌలిక సదుపాయాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానిక కాలనీ వాసులు హన్మంతన్నకు విన్నపించగా సానుకూలంగా స్పందించి పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు . ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం అధ్యక్షులు దుడ్డు నర్సింగరావు, జనరల్ సెక్రెటరీ కొమ్ము బిక్షపతి, మాజీ సర్పంచ్ మైసిగారి శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నాగభూషణం, శ్రవణ్ కుమార్, సిద్దనోళ్ల సంజీవ రెడ్డి, కృష్ణమూర్తి రంగారావు, వేణు ,14 వ వార్డు అధ్యక్షులు దుడ్డు రాహుల్, కొమ్ము శ్రీరాములు, బైండ్ల ఈశ్వర్, బండ శ్రీనివాస్, బండ వెంకటయ్య, దుడ్డు ప్రభు కుమార్, దుడ్డు కిషన్ పాల్గొన్నారు .
About The Author

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Comment List