కంది ‘తహశీల్దార్ కార్యాలయంలో’ దొంగలు..?

• ఇంటి దొంగలా?, బయటి దొంగలా? • శాఖాపరమైన చర్యలు ఎందుకు తీసుకోలేదు? • పోలీసులకు ఎందుకు పిర్యాదు చేయలేదు? • నిజాలను దాచే అధికారులను ఏమనాలి?

On
కంది ‘తహశీల్దార్ కార్యాలయంలో’ దొంగలు..?

సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, సెప్టెంబర్ 28, న్యూస్ ఇండియా : సంగారెడ్డి జిల్లా, కంది తహశీల్దార్ కార్యాలయంలో దొంగలు పడ్డారా..? అనే ప్రశ్నకు సంబంధిత అధికారులు తహశీల్దార్, నాయబ్ తహశీల్దార్ ల దగ్గర జవాబు లేని పరిస్థితులు దాపురించాయి. సర్వే.నం 616 ప్రభుత్వ భూమి కు సంబంధించిన అధికారిక దస్తావేజులు ప్రతేక్యంగా 'కొన్ని మాత్రమే' కనిపించకపోవడం అనేక అనుమానాలకు తావునిస్తుంది. గతంలో ఈ తహశీల్దార్ కార్యాలయం నుండి 'అర్టిఐ దరఖాస్తు' ద్వారా సంబంధిత దస్తావేజులు జారీచేసి ఇవ్వడం జరిగినది. 2025 వ సంవత్సరంలో మాత్రమూ సంబంధిత దస్తావేజులు కనిపించకపోవడం ఒకింత ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ప్రభుత్వం ద్వారా ఇండ్ల స్థలాలు లబ్దిపొందిన వారి జాబితా వాటితో పాటు ప్రత్యేకంగా కొన్ని నివేశిత పట్టా పత్రాల దస్తావేజులు కనిపించకపోవడం అంటే అది ఖచ్చింతంగా ఇంటిదొంగల పని మాత్రమే అయివుంటుందని ఆ కార్యాలయంలో పని చేస్తున్న కొంతమంది ఉద్యోగులు అభిప్రాయం తెలియచేస్తున్నారు. ఇంటిదొంగలను వెనుకవేసుకొనే కొంతమంది ఉద్యోగులు మాత్రం ఇది ఖచ్చితంగా బయటి దొంగల పని మాత్రమే అయివుంటుందని వారి అభిప్రాయం తెలియచేస్తున్నారు. ఇంటిదొంగల పాత్ర వున్నట్లయితే శాఖాపరమైన చర్యలు ఎందుకు తీసుకోలేదని..? ఆ కార్యాలయంలో పని చేస్తున్న కొంతమంది ఉద్యోగులు గుసగుసలాడుతుండగా.. బయటి దొంగల పాత్ర వున్నట్లయితే పోలీసులకు ఎందుకు పిర్యాదు చెయ్యలేదని..? ఇంకొంతమంది ఉద్యోగులు రుసరుసలాడుతున్నారు.! సంబంధిత విషయాల పట్ల అన్ని తెలిసిన అధికారులు  కావాలని నిజాలను దాచిపెట్టి కాలయాపన చేస్తూ 'అక్రమార్కులను' కాపాడడానికి ప్రయత్నం చేస్తూ వారి మోచేతినీళ్ళు త్రాగుతున్నారని కంది గ్రామస్తులు బహిరంగంగా విమర్శలు చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ 'జిల్లా కలెక్టర్ (రెవెన్యూ), విధుల్లో భాగంగా ఈ కీలక అంశాలుగా పరిగణించాలని ఈ విషయంలో కల్పించుకొని విచారణ చేపట్టి నిజాలను ప్రజలకు తెలియ చేయాల్సిన బాధ్యత మరిచిపోవద్దని హితువుపలికారు.Kandi taheshildhar karyalayamlo dongalu copy



Views: 230
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News