సర్దార్ @150 ఐక్యత ప్రచారం ప్రారంభం పరిచయం.
కేంద్ర యువజన సర్వీసులు మరియు క్రీడా వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మైభారత్ ద్వారా వికసిత భారత్ పాదయాత్రలను నిర్వహించనుంది.
ఈ వినూత్న కార్యక్రమం ద్వారా భారతదేశం యొక్క ఖ్యాతిని చాటి చెప్పడం మరియు మన ప్రజాస్వామ్యకు అంశాలని పరిపుష్టం చేయడంతో పాటుగా దేశం కోసం పాటుపడిన త్యాగధనులను స్మరించుకుంటూ
యువతలో ఐక్యత భావాన్ని మరింత బలోపేతం చేయడం లక్ష్యంగా ఈ కార్యక్రమం రూపదిద్దుకుంది.
గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి దేశ నిర్మాణంలో ప్రజల భాగస్వామ్యం ఆలోచనను అనుసరించి రూపొందిన ఈ కార్యక్రమంలో కీలకమైన ప్రతి ఒక్కరిని యువత నుంచి వయో వృద్ధుల వరకు అందరూ పాలుపంచుకునేలా చేయనుంది.
దేశ అభివృద్ధిలో యువత భాగస్వామ్యాన్ని ముఖ్యంగా అమృత పీది ద్వారా స్పష్టంగా బలోపేతం చేస్తూ భారత జాతి నిర్మాణంలో శ్రమించిన జాతీయ నాయకులకి ఘన నివాళి అర్పించనుంది.
భారత ఉక్కు మనిషి
సర్దార్ వల్లభాయ్ పటేల్ 150 ఒక జన్మదినాన్ని పురస్కరించుకొని భారత ప్రభుత్వం తరఫున కేంద్ర యువజన సర్వీసులు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ మై భారత ద్వారా అక్టోబర్ 6వ తేదీన సర్దార్ @150 ఐక్యత మార్చి పేరుతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది.
ఐక్యత, దేశభక్తి, సామాజిక బాధ్యత లను దేశ యువతలో పెంపొందించ చేయడము లక్ష్యంగా చేపట్టిన ఈ దేశవ్యాప్త కార్యక్రమం లో భాగంగా భారతదేశాన్ని ఏకతాటిపైకి తీసుకువచ్చిన నేతల త్యాగాలను స్మరించుకోనున్నారు .
ఈ కార్యక్రమంలో భాగంగా యువత తమ దైనందిన & సామాజిక జీవితంలో ఏక్ భారత్ , ఆత్మ నిర్భర్ భారత్ వంటి అంశాలను భాగం చేసుకునేలా ప్రోత్సాహం అందించనున్నారు.
డిజిటల్ దశ లో ప్రారంభం
ఈ ప్రచార కార్యక్రమం గౌరవ కేంద్ర యువజన సర్వీసులు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ మంత్రి డాక్టర్ మన్సుక్ మాండవియ చేతుల మీదుగా అక్టోబర్ ఆరవ తేదీన డిజిటల్ రూపంలో ప్రారంభమైంది.
ఈ డిజిటల్ విధానంలో సోషల్ మీడియా వ్యాస రచన, సర్దార్@150 యంగ్ లీడర్స్ ప్రోగ్రాం క్విజ్ కాంపిటీషన్స్ ఉండనున్నాయి.
ప్రచార దశ సర్దార్@150 యూనిటీ మార్చ్ అనేది ఈ క్రింది దశల్లో దేశవ్యాప్తంగా నిర్వహించనున్నారు.
1.జిల్లాస్థాయి పాదయాత్రలు ( అక్టోబర్ 31 నుంచి నవంబర్ 25 వరకు)
_అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో అన్ని జిల్లాల్లో మూడు రోజులపాటు 8 నుంచి పది కిలోమీటర్ల ప్రాంతాన్ని అనుసంధానం చేసేలా పాదయాత్రలు నిర్వహించనున్నారు.
_ముందస్తు కార్యక్రమాల్లో భాగంగా హెల్త్ క్యాంప్స్, సర్దార్ వల్లభాయ్ పటేల్ జీవితం పై ప్రసంగాలు డ్రగ్స్ రహిత భారత దేశం పై ప్రతిజ్ఞలు చేయనున్నారు.
_పాదయాత్రలో భాగంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి లేదా విగ్రహానికి నివాళులర్పించడం ఆత్మ నిర్భరభారత్ ప్రతిజ్ఞ చేయటం ఏక భారత్ ఆత్మ నిర్వర్భారత్ వంటి వాటిపై సాంస్కృతిక కార్యక్రమాలు మరియు సర్టిఫికెట్ల ప్రధానం ఉండనుంది.
_రాష్ట్రాల్లో మరియు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని యువజన సర్వీసుల శాఖ మంత్రులు స్థానిక లోక్సభ మరియు రాజ్యసభ సభ్యులను కలుపుకొని జిల్లా అధికారులు, మై భారత్, Ncc అధికారుల సమన్వయంతో ఆయా జిల్లాల్లో మరియు పార్లమెంటరీ నియోజకవర్గాల్లో ఈ పాదయాత్రలను నిర్వహించి క్షేత్రస్థాయిలో ప్రజలచే బలమైన భాగస్వామ్యాన్ని కల్పించి శక్తివంతమైన నాయకత్వం రూపొందించేందుకు కృషి చేస్తారు.
2. జాతీయ మార్చ్ (నవంబర్ 26 నుంచి డిసెంబర్ 6 2025)
_ సర్దార్ పటేల్ పుట్టిన ప్రాంతమైన కరంసద్ నుంచి కివాడియాలో ఉన్న స్టాచూ ఆఫ్ యూనిటీ వరకు 150 కిలోమీటర్ల మార్చ్ కొనసాగనుంది.
_ పాదయాత్ర జరిగే అన్ని ప్రాంతాల్లో మేరా యువభారత్, ఎన్ఎస్ఎస్ మరియు ఇతర యువ నాయకులతో ముందస్తు కార్యక్రమాలు మరియు సామాజిక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నారు.
_ భారతదేశం యొక్క విశిష్ట సంస్కృతిని సర్దార్ పటేల్ జీవితం రూపంలో 150 పిట్ స్టాప్ ల ద్వారా తెలియజేయనున్నారు.
_ గౌరవ కేంద్ర మంత్రితో 150 మంది యువ నాయకులు ఈ పాదయాత్రలో కలిసి నడవనున్నారు.
_ప్రతిరోజు సాయంత్రం సర్దార్ పటేల్ యొక్క జీవితం మరియు విజయాలని సర్దార్ గాథ పేరుతో సుప్రసిద్ధ స్కాలర్లు తెలియజేయనున్నారు.
అన్ని రకాలైన రిజిస్ట్రేషన్ మరియు కార్యక్రమాలు మై భారత్ పోర్టల్ https://mybharat.gov.in/mega_events ద్వారా నిర్వహించబడతాయి.
భారతదేశ వ్యాప్తంగా ఉన్న యువత ఈ కార్యక్రమాల్లో నమోదు చేసుకోవడానికి మరియు చారిత్రాత్మక అంశంలో భాగస్వామ్యం పంచుకోవడానికి ఆహ్వానించబడుతున్నారు అని మేరా యువ భారత్ ఖమ్మం డిప్యూటీ డైరెక్టర్ చింతల అన్వేష్ గారు, ఎన్ఎస్ఎస్ రీజినల్ కోఆర్డినేటర్ ఈసం నారాయణ గారు మరియు ఎన్ఎస్ఎస్ జిల్లా కోఆర్డినేటర్ ఎన్ శ్రీనివాస్ గారు విలేకరులకు వివరించారు
Comment List