యూనిఫామ్ వేసుకు రాలేదని విద్యార్థుల పట్ల తీవ్రమైన పదజాలాలతో తిట్టిన ప్రధానోపాధ్యాయుడు 

యూనిఫామ్ వేసుకు రాలేదని విద్యార్థుల పట్ల తీవ్రమైన పదజాలాలతో తిట్టిన ప్రధానోపాధ్యాయుడు 

మహబూబాబాద్ జిల్లా:-

తొర్రూరు పట్టణం:- 

మధ్యాహ్న భోజనం బాగాలేదు అన్నందుకు అది మనసులో పెట్టుకొని పదవ తరగతి విద్యార్థులను ప్రధానోపాధ్యాయుడు యూనిఫామ్ వేసుకు రాలేదని విద్యార్థుల పట్ల తీవ్రమైన పదజాలాలతో తిట్టిన ప్రధానోపాధ్యాయుడు 

మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో శుక్రవారం ఉదయం యధావిధిగా విద్యార్థులు పాఠశాలకు వచ్చారు కొంతమంది విద్యార్థులు స్కూల్ యూనిఫామ్ వేసుక రాకపోవడంతో దానికి ఆగ్రహించిన ప్రధానోపాధ్యాయుడు జెల్లా లక్ష్మీనారాయణ విద్యార్థుల పట్ల అసభ్యంగా తిడుతూ ఇష్టం వచ్చినట్టుగా మాటలు అంటున్నాడని స్కూల్లో తను చెప్పిందే వేధంగా తను చేసేదే కరెక్ట్ అన్నట్టుగా ప్రవర్తిస్తున్నాడని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు.. 
ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ మాకు పాఠశాలలో మధ్యాహ్న భోజనం దయనీయమైన స్థితిలో ఉంటుందని ఏమాత్రం కూడా అన్నం ఉడకకపోవడం కూరలలో నీళ్లు ఎక్కువగా పోసి వండడం సాంబారు నీళ్లు నీళ్లుగా ఉండడం విద్యార్థులకు ఇవ్వవలసిన కోడిగుడ్లను రోజుకు 80 గుడ్లను ప్రధానోపాధ్యాయుడే మాయం చేయడం ఇలాంటివన్నీ  అడగడంతో ఆ కోపంతో విద్యార్థులను స్కూలు యూనిఫామ్ వేసుకురాలేదు అని ప్రతిరోజు తీవ్రమైన పదజాలలతో తిట్టి మిమ్ములను పోలీసులతో కొట్టిస్తాను అని బెదిరించి నానా దుర్భాషలాడాడు అని విద్యార్థులు వాపోయారు.
స్కూల్లోని వాష్ ఏరియా ప్రాంతం గానీ బాత్రూంలు గాని వంటశాలలు గాని ఘోరంగా ఉన్నాయని ఏమాత్రం శుభ్రత పాటించుట లేరని ఇవన్నీ ఎక్కడ విద్యార్థులు బయటపెడతారు అని విద్యార్థులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని తెలిపారు. 
మా పాఠశాలను ఇప్పటికైనా పైఅధికారులు మరియు స్థానిక ఎమ్మెల్య మామిడాల యశస్విని రెడ్డి సందర్శించి పరిస్థితులను తెలుసుకొని అన్ని విధాలుగా స్కూలులోని అశుభ్రమైన ప్రాంతాలను బాత్రూంలకు వెళ్లకుండా ఎక్కడికక్కడ నీరు నిలిచిన ప్రాంతాలను మరియు డైనింగ్ హాలు పూర్తికాకపోవడాన్ని వాటర్ ప్లాంట్ పూర్తి చేయకపోవడాన్ని అన్ని పరిస్థితులను తెలుసుకొని స్కూలు బాగు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు.

Read More వార్తాపత్రికలో అరుదైన గౌరవం దక్కించుకున్న గుద్దేటి రమేష్ బాబు

Views: 67
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News