బల్దియా అంటేనే అవినీతి కంపు..!

పారిశుద్ధ్య నిర్వహణ అస్తవ్యస్తం..!

On
బల్దియా అంటేనే అవినీతి కంపు..!

బల్దియాలో పనిచేయని లిఫ్ట్..
 
 పారిశుద్ధ్య నిర్వహణ అస్తవ్యస్తం..!

IMG-20251026-WA1083
బల్దియాలో పనిచేయని లిఫ్ట్..

 బల్దియా అంటేనే అవినీతి కంపు..!

ఏళ్ల తరబడి కొనసాగుతున్న బిల్డింగ్ అంతర్గత మరమ్మతులు..

 పక్కదారి పడుతున్న మెయింటెనెన్స్ నిధులు..

రంగారెడ్డి జిల్లా, ఎల్బీనగర్ అక్టోబర్ 26 న్యూస్ ఇండియా ప్రతినిధి: జీహెచ్ఎంసీ సరూర్ నగర్ సర్కిల్ కార్యాలయంలో అవినీతి కంపు రాజ్యమేలుతుంది. ఈ కార్యాలయానికి వచ్చే ప్రజలకు సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. స్వచ్ఛభారత్, స్వచ్ఛ తెలంగాణ నినాదంతో కాలనీలను, డివిజన్ లను శుభ్రపరిచే బల్దియానే నిర్వహణ లోపం, అధికారుల నిర్లక్ష్యంతో చెత్తా చెదారంతో నిండిపోతుంది. అదెక్కడో కాదు.. సరూర్ నగర్ పరిధిలో ఉన్న సర్కిల్ 3- 4- 5 కార్యాలయమే ఇందుకు నిదర్శనం. ఇక్కడికి స్థానిక ప్రజలు అనేక పనులపై వస్తుంటారు. కానీ అధికారుల నిర్లక్ష్యంతో వికలాంగులకు, వృద్ధులకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఇక్కడి దుస్థితి  చూసి ప్రజలే ఆశ్చర్యపోతున్నారు. తమ కార్యాలయంలో ఓ లిఫ్టును కూడా బాగు చేసుకోలేని వాళ్లు.. తమ ఆఫీసును కూడా పరిశుభ్రంగా నిర్వహించుకోలేని అధికారులు ఇక వాళ్ల పరిధిలోని కాలనీలను, డివిజన్ పరిధిలోని బస్తీలను ఎలా పరిశుభ్రంగా ఉంచుతారనే చర్చ మొదలైంది..  

*పని చేయని లిఫ్ట్*
 
జీహెచ్ఎంసీ సరూర్ నగర్ సర్కిల్ పరిధిలోని కార్యాలయంలో గత ఏడాది కాలంగా లిఫ్ట్ పని చేయడం లేదు. దీంతో అనేక పనుల కోసం వచ్చే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా వృద్ధులు వికలాంగులు లిఫ్ట్ పని చేయకపోవడంతో రెండవ, మూడవ అంతస్తులోని కార్యాలయాల్లోకి తమ పనుల నిమిత్తం వెళ్లేందుకు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఏదైనా మరమ్మత్తులు ఉంటే.. వారం.. పది రోజుల్లో పరిష్కరించాల్సిన సంబంధిత అధికారులు తమకేమీ పట్టనట్టు వ్యవహరించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

*మెయింటెనెన్స్ నిధులు ఏమైతున్నట్టు..?*

ప్రభుత్వం ముఖ్యంగా జీహెచ్ఎంసీ నిధుల నుంచి ప్రతి సర్కిల్ కార్యాలయాలకు మెయింటెనెన్స్ కోసం కొంత ఫండ్ ను ప్రతినెలా రిలీజ్ చేస్తుంది. అట్లాగే సరూర్ నగర్ సర్కిల్ కార్యాలయానికి ప్రతి నెల మెయింటెనెన్స్ కోసం నిధులు విడుదలవుతున్నట్లు తెలుస్తోంది. ఈ నిధులు వేళల్లో కాదు.. రూ. లక్షల్లో ఉన్నట్లు సమాచారం. మరి ఇవి ఎక్కడికి వెళ్తున్నాయి. ఏడాదికాలంగా వృద్ధులు, వికలాంగులు సరూర్ నగర్ సర్కిల్ కార్యాలయాలకు వచ్చే ప్రజలంతా ఇబ్బందులు పడుతుంటే ఈ పక్క దారి పట్టిన నిధులు ఎవరి జేబులోకి వెళ్తున్నాయి..? అనే ప్రశ్న తలెత్తుతుంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు దృష్టి సారించి ప్రజల ఇబ్బందులను గ్రహించి.. మెయింటెనెన్స్ నిధులను పక్కదారి పట్టిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. వెంటనే సరూర్ నగర్ జీహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.

Views: 3

About The Author

Post Comment

Comment List

Latest News

రఘునాథపాలెం మండలం జీకే బంజర గ్రామపంచాయతీ సర్పంచ్ బరిలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాలోత్ జ్యోతి రఘునాథపాలెం మండలం జీకే బంజర గ్రామపంచాయతీ సర్పంచ్ బరిలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాలోత్ జ్యోతి
ఖమ్మం డిసెంబర్ 10 న్యూస్ ఇండియా ప్రతినిధి (ఉపేందర్) ఖమ్మం రఘునాధపాలెం మండలం జికే బంజర గ్రామపంచాయతీ సర్పంచ్ బరిలో బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన మాలోత్ జ్యోతి...
రఘునాథపాలెం మండలం జికే బంజర గ్రామపంచాయతీ సర్పంచ్ బరిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బానోతు అంజలి
రఘునాధపాలెం మండలం కె.వి బంజర గ్రామ సర్పంచ్ బరిలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి భూక్య సరిత
రఘునాథపాలెం మండలం గణేశ్వరం గ్రామ సర్పంచ్ బరిలో కాంగ్రెస్ అభ్యర్థి భూక్య నాగేశ్వరరావు
చెరువు కొమ్ముతండా గ్రామ సర్పంచ్ బరిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భుక్య భాష
అతి చిన్న వయసులో సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన మాలోతు భార్గవి
ఉప సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గుగులోతు నాగేశ్వరరావు