రాజ్యాంగం దినోత్సవం
సోమరావు శ్రీకాంత్ ఆధ్వర్యంలో రాజ్యాంగం బుక్స్ మరియు
పౌరుడు రాజ్యాంగంపై అవగాహన కలిగి ఉండాలని అంబేద్కర్ వాది సోమారపూ శ్రీకాంత్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలో అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో భారత రాజ్యాంగం దినోత్సవం పురస్కరించుకొని ముఖ్య అతిథులుగా అంబేద్కర్ వాది సోమారపు శ్రీకాంత్ విచ్చేసి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి యువత డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు బానిసలై వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు భవిష్యత్ భారతాన్ని నిర్మించడంలో విద్యార్థుల పాత్ర కీలకంగా ఉంటుందని ఆ సమయంలో విద్యార్థులు చేయడం మార్గాలను విస్మరించి సమాజ శ్రేయస్సు కు కృషి చేయాలని ఆయన అన్నారు. విద్యార్థి దశ నుండి భారత రాజ్యాంగం చూపిన మార్గాన్ని అనుసరిస్తూ స్ఫూర్తిదాయకంగా విద్యావేత్తలుగా ఎదగాలని ఆయన అన్నారు. స్వతంత్రం వచ్చే నాటికి భారతదేశ మనగడ పై విమర్శలు గుప్పించిన వారికి మన రాజ్యాంగం యొక్క ఔనుత్వాన్ని గొప్పతనాన్ని రచించిన అమలు చేసిన మహనీయులు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని ఆయన కొనియాడారు. మన శరీరంలో గుండె ఎంత ముఖ్యమో భారత రాజ్యాంగం కూడా అంతే ముఖ్యమైందని ఆయన పేర్కొన్నారు. వ్యాస రచన పోటీలో గెలుపొందిన విద్యార్థులకు ప్రధమ ద్వితీయ తృతీయ బహుమతి నగదు రాజ్యాంగ పుస్తకం , , కన్సోలేషన్ బహుమతులు, లకు అందించారు.

Comment List