రాములు తండా గ్రామపంచాయతీలో సర్పంచ్ ఏకగ్రీవం.సర్పంచ్ గా బానోత్ వెంకట్రాం
ఖమ్మం డిసెంబర్ 4 న్యూస్ ఇండియా ప్రతినిధి (ఉపేందర్) ఖమ్మం రఘునాథపాలెం మండలం రాములు తండా గ్రామపంచాయతీ లో సర్పంచ్ ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కాంగ్రెస్ పార్టీ తరపున సర్పంచ్ గా నామినేషన్ వేశారు.గతంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉంటూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు అతి సన్నిహితుడుగా మెలుగుతూ ప్రజల కష్ట సుఖాలలో పాలుపంచుకుంటూ,పార్టీకి నమ్మకస్తుడిగా ఉన్న బానోత్ వెంకట్రాం ను సర్పంచ్ గా ఏకగ్రీవం చేశారు.సర్పంచ్ గా ఎన్నికైన బానోతు వెంకట్రామ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీకి కట్టుబడి ఉంటూ పదవి కోసం ఆశించకుండా ప్రజలకు సేవ చేస్తూ అధ్యక్షుడిగా ఉన్నందున,ప్రజల అభిమానంతో నన్ను సర్పంచిగా ఎన్నుకున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఇకముందు గ్రామ అభివృద్ధికి తోడ్పడుతూ ప్రభుత్వం నుండి వచ్చే పథకాలను ప్రజలకు అందే విధంగా చేస్తానని ప్రజలకు ఎటువంటి కష్టం వచ్చినా నేను ముందు ఉంటానని అన్నారు.పార్టీ అధిష్టానానికి కట్టుబడి పని చేస్తానని పేర్కొన్నారు.


Comment List