చదువుతో పాటు క్రీడల్లో కూడా ప్రతిభ చాటుతున్న ఆకుల చంద్ర దీప్షిక
ఖమ్మం డిసెంబర్ 4 న్యూస్ ఇండియా ప్రతినిధి (ఉపేందర్) మున్నూరుకాపు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆకుల గాంధీ మనుమరాలు,గాంధీ పెద్ద కుమారుడు ప్రశాంత్ కుమార్ ఏకైక కూతురు చంద్ర దీప్షిక,విద్యతో పాటు క్రీడలు,వక్తృత్వంలో కూడా తన ప్రతిభను నిరూపిస్తూ అందరి ప్రశంసలు అందుకుంటోంది.హైదరాబాద్‌లో నివసిస్తూ,నానకరాంగూడలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లో చదువుతున్న దీప్షిక,పాఠ్య కార్యక్రమాలతో పాటు క్రీడా రంగంలోనూ చురుకైన పాత్ర పోషిస్తోంది.ఇటీవల పాఠశాలలో నిర్వహించిన ఫుట్బాల్,త్రోబాల్ పోటీల్లో పాల్గొని ద్వితీయస్థానం సాధించి పతకాలు అందుకుంది.అలాగే,రాక్ వెల్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో RockMUN–25 పేరిట నవంబర్ 21 నుంచి 23 వరకు నిర్వహించిన మోడల్ యునైటెడ్ నేషన్స్ (MUN) సమావేశాల్లో కాంగో దేశ ప్రతినిధిగా పాల్గొని తన వక్తృత్వంతో అందర్నీ ఆకట్టుకుంది.అణ్వాయుధాలు మానవజాతికి తీవ్రమైన ముప్పు కలిగిస్తాయని,వాటి వినియోగాన్ని నిలిపివేయాలని తన స్పష్టమైన అభిప్రాయాన్ని ధైర్యంగా వినిపించి అందరి మన్ననలు పొందింది.ఈ సందర్భంగా దీప్షికకు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అధ్యాపకులు, కుటుంబ సభ్యులు,బంధుమిత్రులు ప్రేమతో అభినందనలు తెలియజేసి,భవిష్యత్తులో మరెన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆశీస్సులు అందించారు.


Comment List