ఇందిరమ్మ చీరలు పంపిణి చేసిన సర్పంచ్ నిరుడి దాసు
టేక్మాల్ రిపోర్టర్ జైపాల్
మెదక్ జిల్లా టేక్మాల్ మండలం వేల్పుగొండ గ్రామంలో సర్పంచ్ నిరుడి దాసు ఇందిరమ్మ చీరలు పంపిణి చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ చీరలు పంపిణీ కార్యక్రమం టేక్మాల్ మండలం పరదిలోని వేల్పుగొండ గ్రామ పంచాయతీ భవనంలో సోమవారం ఉదయం సర్పంచ్ నిరుడి దాస్ మహిళాలకు ఇందిరమ్మ చీరలు ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ రాష్ట్ర మహిళల ఆత్మగౌరవాన్ని ఇనుమడింపజేసేలా ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తోందని మహిళల ఆర్థిక, సామాజిక అభివృద్ధి కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని, మహిళలు అన్ని రంగాల్లో ముందుకు రావాలంటే అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని, గ్రామాన్ని అభివృద్ధి పరుచాలనే దృఢ సంకల్పముతో కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సెక్రటరీ రాఘవేందర్, ఉపసర్పంచ్ ఎంపీ సుధాకర్, వీవోఏ అబ్బని రాములు గ్రామ వెలుగు సమైక్య సంఘం సభ్యురాలు ఆవుసుల పద్మ తదితరులు పాల్గొన్నారు.

Comment List