ప్రశాంత్ నగర్‌లో భూకబ్జా ముఠా అరాచకం

పెట్రోల్ పోసి చంపేందుకు యత్నం!

On
ప్రశాంత్ నగర్‌లో భూకబ్జా ముఠా అరాచకం

మహిళా ముఠాపై టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు.. సీఐ ప్రతాప్ కఠిన చర్యలు

భద్రాద్రి కొత్తగూడెం(న్యూస్ ఇండియా ప్రతినిధి) మార్చ్ 2:పట్టణంలోని ప్రశాంత్ నగర్ పంచాయతీ పరిధిలో భూ వివాదం ముదిరి, చివరకు ప్రాణాలు తీసే స్థాయికి చేరింది. హక్కు పత్రాలు ఉన్న యజమానిని బెదిరించడమే కాకుండా, పెట్రోల్ పోసి చంపేందుకు ప్రయత్నించిన దారుణ ఘటన కలకలం రేపింది. ఈ ఘటనపై బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రామవరం టూ టౌన్ సీఐ డి. ప్రతాప్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.ఘటన వివరాల్లోకి వెళ్తే..బాధితురాలు ఇల్లుటూరి శైలజకు రామవరం ప్రశాంత్ నగర్‌లోని సర్వే నంబర్ 4-44లో 780 గజాల సొంత స్థలం ఉంది. దానికి సంబంధించి అన్ని రకాల ప్రభుత్వ, రెవిన్యూ పత్రాలు ఆమె వద్ద సిద్ధంగా ఉన్నాయి. ఈ క్రమంలో తన స్థలంలో ఇల్లు నిర్మించుకోవడానికి శైలజ కూలీలను పెట్టి పనులు చేయిస్తుండగా, సి.ఆర్.పి క్యాంప్ ప్రాంతానికి చెందిన ఒక మహిళా ముఠా అకస్మాత్తుగా దాడికి దిగింది.పెట్రోల్ బాటిళ్లతో భీభత్సం నిర్మాణ పనులను అడ్డుకున్న కొర్లపాటి పండారి, మాధవి, లక్ష్మీ, శిల్ప, జయమ్మ, లోతు సంగీత, తబిత, అమృతయ్య, రఘు, పృధ్వి అనే వ్యక్తులు శైలజపై దాడికి ప్రయత్నించారు. పెట్రోల్ బాటిళ్లతో వచ్చి, తమపై తాము పోసుకుని చనిపోతామని బెదిరించడమే కాకుండా.. అత్యంత ప్రమాదకరంగా బాధితురాలిపై కూడా పెట్రోల్ పోసి హతమార్చడానికి ప్రయత్నించారు. ఈ అరాచకానికి కొర్లపాటి రఘు, లోతు కార్తీక్ (అలియాస్ బబ్లు), పాషాలు వెనకుండి ప్రోత్సహించినట్లు బాధితురాలు ఆరోపించారు.ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడిన బాధితురాలు శైలజ వెంటనే కొత్తగూడెం టూ టౌన్ పోలీసులను ఆశ్రయించారు. సీఐ ప్రతాప్ ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి, నిందితులపై వివిధ సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి కేసు నమోదు చేశారు.చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని, మహిళా ముఠాలను అడ్డుపెట్టుకుని భూదందాలకు పాల్పడే వారిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటాం అని సీఐ ప్రతాప్ స్పష్టం చేశారు.

Views: 84
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

పార్లమెంట్ సభ్యులుగా మారిన డిగ్రీ మహిళ విద్యార్థులు పార్లమెంట్ సభ్యులుగా మారిన డిగ్రీ మహిళ విద్యార్థులు
ఖమ్మం మార్చి 2 ఖమ్మం న్యూస్ ప్రతినిది: ఖమ్మం నగరంలోని ప్రభుత్వ మహిళ డిగ్రీ కళాశాల వేదికగా జిల్లా స్థాయి యువ పార్లమెంట్ పోటీలు అత్యంత ఉత్సాహభరితంగా...
ప్రశాంత్ నగర్‌లో భూకబ్జా ముఠా అరాచకం
చంద్రగ్రహణం సందర్భంగా రేపు పెద్దమ్మ గుడి మూసివేత
మన్నెగూడలోని ఎస్ఆర్ హ్యాచరీస్ పై రైతుల ఆగ్రహం..
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడును మర్యాదపూర్వకంగా కలిసిన నీరుకొండ ఉషారాణి
అభినవ్ హై స్కూల్ లో ఘనంగా స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ (SLC),హై స్కూల్ సైన్స్ ఎక్సపో
వనంవారి కృష్ణాపురం గ్రామ గర్వకారణం ఏటుకూరి మునేశ్వరావు