జిల్లా పోలీసు హెడ్ క్వార్టర్స్ లో ఘనంగా హోలీ
వేడుకలలో పాల్గొన్న జిల్లా ఎస్పీ రోహిత్ రాజు
భద్రాద్రి కొత్తగూడెం (న్యూస్ ఇండియా ప్రతినిధి) మార్చి 4 : హోలీ వేడుకలు జిల్లా పోలీసు హెడ్ క్వార్టర్స్ లో బుధవారం ఘనంగా నిర్వహించారు.ఈ వేడుకల్లో జిల్లా ఎస్పీ రోహిత్ రాజు పాల్గొన్నారు. జిల్లా పోలీస్ అధికారులంతా కలిసి ఎస్పీ క్యాంప్ కార్యాలయానికి వెళ్లి హోలీ వేడుకలకు ఎస్పీ రోహిత్ రాజును ఆహ్వానించారు.అక్కడ అధికారులు,సిబ్బంది రంగులు చల్లుకుంటూ సందడి చేశారు.అనంతరం ఎస్పీతో కలిసి అధికారులంతా హేమచంద్రాపురం నందు గల పోలీస్ హెడ్ క్వార్టర్స్ నకు చేరుకొని పోలీస్ బ్యాండ్ చప్పుళ్లకు నృత్యాలు చేశారు.జిల్లా పోలీసు అధికారులు,సిబ్బంది హెడ్ క్వార్టర్స్ నందు ఆనందోత్సవాల మధ్య కేరింతలతో హోలీ వేడుకలను జరుపుకున్నారు.ఈ ఉత్సవాల్లో భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్,కొత్తగూడెం డిఎస్పీ ఆదినారాయణ,పాల్వంచ డిఎస్పీ సతీష్ కుమార్,మణుగూరు డిఎస్పీ రవీందర్ రెడ్డి,ఇల్లందు డిఎస్పీ వెంకన్న బాబు మరియు సీఐలు,ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.

Comment List