హత్యాయత్నం కేసులో ఐదుగురి అరెస్ట్ 

వివరాలు వెల్లడించిన వన్ టౌన్ సిఐ కరుణాకర్ 

On
హత్యాయత్నం కేసులో ఐదుగురి అరెస్ట్ 

భద్రాద్రి కొత్తగూడెం(న్యూస్ ఇండియా ప్రతినిధి) మార్చి 7 :కొత్తగూడెం నెహ్రూ బస్తి రైలు పట్టాల సమీపంలో ఈ నెల 4వ తేదీన నరేష్ కోరి (40) సంవత్సరాలు అను వ్యక్తిపై హత్యాయత్నం జరిగింది.రైలు పట్టాల వద్ద ఉన్న కిరాణా దుకాణం వద్ద స్నేహితుడితో కలిసి మాట్లాడుతున్న నరేష్ పై నాతరి శ్రీనాథ్,లోకేష్,శివ సంజయ్,వసుకుల ఉదయ్,నాతరి రాజేశ్వరరావు @ ఐలయ్య లు దాడి చేశారు.రోకలి బండతో నరేష్ తలపై గట్టిగా కొట్టడంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు.తలకు పలుచోట్ల గాయాలు కావడంతో స్పృహ కోల్పోయి ప్రాణాపాయస్థితికి చేరుకున్నాడు.వైద్యం నిమిత్తం ఖమ్మంలోని ప్రైవేట్ ఆసుపత్రికి నరేష్ ను తరలించారు.అక్కడ చికిత్స పొందుతున్న నరేష్ పరిస్థితి విషమంగా ఉంది.నెహ్రూ బస్తీ ఏరియాలో నిర్మల అనే మహిళకు చెందిన రెండు అంతస్తుల భవనాన్ని ఐలయ్య కొన్ని నెలల క్రితం ఆక్రమించాడు.అతని వద్ద నిర్మల 4 లక్షల రూపాయలు అప్పుగా తీసుకుంది. ఆమెకు అనారోగ్యం కారణంగా ఇల్లు ఖాళీ చేసి వెళ్లడంతో అప్పు డబ్బులు ఇవ్వకపోవడంతో గత 18 నెలల నుండి ఆ ఇంట్లో ఐలయ్య కుటుంబంతో ఉంటున్నాడు.అప్పుగా తీసుకున్న డబ్బులు తిరిగి ఇస్తానని చెప్పినా,ఇల్లు ఖాళీ చేయకుండా ఇబ్బంది పెట్టాడు.ఈ విషయంలో నిర్మలకు నరేష్ సపోర్ట్ చేశాడని కక్ష పెంచుకొని ఉద్దేశపూర్వకంగా నరేష్ పై దాడి చేసిన పైన పేర్కొన్న ఐదుగురు నిందితులను శనివారం 1టౌన్ పోలీసులు అరెస్టు చేసి,వారిపై హత్యాయత్నం కేసు నమోదు చేసి రిమాండ్ నిమిత్తం కోర్టునకు తరలించడం జరిగిందని కొత్తగూడెం 1టౌన్ ఇన్స్పెక్టర్ కరుణాకర్ వివరాలను వెల్లడించారు.

Views: 164
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News