సెకండ్ ఛాన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్యాడ్స్ పంపిణీ 

విద్యార్థులకు అందించిన ఫౌండర్ రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీ జిల్లా అధ్యక్షులు కట్ట సతీష్  

On
సెకండ్ ఛాన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్యాడ్స్ పంపిణీ 

కట్ట సతీష్ ను సన్మానించిన పాఠశాల ఉపాధ్యాయులు

IMG-20260308-WA0027పాల్వంచ (న్యూస్ ఇండియా)మార్చి 07 :పాల్వంచ పట్టణంలోని అభ్యుదయ పాఠశాల (ప్రభుత్వ ఉన్నత పాఠశాల)లో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు సెకండ్ ఛాన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పరీక్షలకు అవసరమైన సామాగ్రిని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సెకండ్ ఛాన్స్ ఫౌండేషన్ ఫౌండర్ మరియు రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు కట్ట సతీష్ పాల్గొని విద్యార్థులకు పరీక్ష అట్టలు, పెన్నులు, పెన్సిల్స్‌ను అందజేశారు. ఈ నెలలో జరగబోయే పదవ తరగతి పబ్లిక్ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని సుమారు 120 మంది విద్యార్థులకు ఈ పరీక్ష సామాగ్రిని అందించరు . ఈ సందర్భంగా కట్ట సతీష్ మాట్లాడుతూ, విద్యార్థులు తమ భవిష్యత్తును లక్ష్యంగా పెట్టుకొని కష్టపడి చదివి మంచి స్థానాలను సంపాదించుకోవాలని ఆకాంక్షించారు. అలాగే విద్యార్థుల చదువులకు అవసరమైన సహాయాన్ని సెకండ్ ఛాన్స్ ఫౌండేషన్ తరఫున భవిష్యత్తులో కూడా కొనసాగిస్తామని హామీ ఇచ్చారు.పాఠశాల విద్యార్థులకు ఇలాంటి సహాయం అందించినందుకు పాఠశాల సిబ్బంది సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం పాఠశాల యాజమాన్యం కట్ట సతీషి ని ఘనంగా సన్మానించరు.ఈ కార్యక్రమంలో సెకండ్ ఛాన్స్ ఫౌండేషన్ మరియు రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీ కార్యవర్గ సభ్యులు జిల్లా కార్యదర్శి మూడ్ వీరన్న, పాల్వంచ టౌన్ ఆర్‌ఎల్‌డీ పార్టీ అధ్యక్షులు పొట్ట పింజర బ్రహ్మానంద రావు, జిల్లా విద్యార్థుల విభాగం అధ్యక్షులు పృథ్వీ నాయక్, జిల్లా మైనారిటీ సంఘ అధ్యక్షులు బన్నీ విజయ్, మీడియా కోఆర్డినేటర్ శ్రీకాంత్ కె, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రమ,పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

Views: 7
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

రెడ్ హ్యాండెడ్‌గా ఇద్దరు ఎస్ఐలు చిక్కారు.. రెడ్ హ్యాండెడ్‌గా ఇద్దరు ఎస్ఐలు చిక్కారు..
రెడ్ హ్యాండెడ్‌గా ఇద్దరు ఎస్ఐలు చిక్కారు.. రెడ్ హ్యాండెడ్‌గా ఇద్దరు ఎస్ఐలు చిక్కారు.. రంగారెడ్డి జిల్లా, ఎల్బీనగర్, మార్చి 09, న్యూస్ ఇండియా ప్రతినిధి: లంచం తీసుకుంటూ...
సెకండ్ ఛాన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్యాడ్స్ పంపిణీ 
హత్యాయత్నం కేసులో ఐదుగురి అరెస్ట్ 
ఘనంగా బొమ్మరాజు జయ యాదయ్య కుమారుని వివాహ మహోత్సవం..
అస్మాతపూర్‌లో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభించిన సర్పంచ్..
వరంగల్ ప్రభుత్వ MGM హాస్పిటల్ లో దారుణం .సమస్యలకు నిలయంగా దవాఖాన
ప్రకాష్ నగర్ లో సందడి సందడిగా హోలీ రంగోలి