డిసెంబర్ 6న కవితను అరెస్ట్ చేస్తారా?

On

లిక్కర్ కేసులో కల్వకుంట్ల కవితకు సీబీఐ నోటీసుులు ఢిల్లీ లిక్కర్ కేసులో డొంక కదులుతోంది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సీబీఐ నోటీసులు ఇచ్చింది. లిక్కర్ స్కామ్ కేసులో సీబీఐ కవితను ప్రశ్నించనుంది. లిక్కర్ స్కామ్లో వివరణ ఇవ్వాలని 160 సీఆర్‌పీసీ కింద కవితకు సీబీఐ నోటీసులు ఇచ్చింది. విచారణకు ఢిల్లీ, హైదరాబాద్లో ఎక్కడైనా హాజరుకావచ్చని నోటీసుల్లో అధికారులు పేర్కొన్నారు. డిసెంబర్ 6న హైదరాబాద్లో సీబీఐ విచారణకు కవిత హాజరుకానున్నారు. అయితే డిసెంబర్ 6న తన నివాసం దగ్గరే […]

లిక్కర్ కేసులో కల్వకుంట్ల కవితకు సీబీఐ నోటీసుులు

ఢిల్లీ లిక్కర్ కేసులో డొంక కదులుతోంది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సీబీఐ నోటీసులు ఇచ్చింది.

లిక్కర్ స్కామ్ కేసులో సీబీఐ కవితను ప్రశ్నించనుంది. లిక్కర్ స్కామ్లో వివరణ ఇవ్వాలని 160 సీఆర్‌పీసీ కింద కవితకు సీబీఐ నోటీసులు ఇచ్చింది.

విచారణకు ఢిల్లీ, హైదరాబాద్లో ఎక్కడైనా హాజరుకావచ్చని నోటీసుల్లో అధికారులు పేర్కొన్నారు. డిసెంబర్ 6న హైదరాబాద్లో సీబీఐ విచారణకు కవిత హాజరుకానున్నారు.

Read More ఎన్నికల ఖర్చు దేశ ఐదేళ్ల బడ్జెట్ మించిపోతుంది

అయితే డిసెంబర్ 6న తన నివాసం దగ్గరే వివరణ ఇస్తానని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చెప్పడం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Read More ఇటుకుల పాడు గ్రామంలో మాల సంఘం కమిటీ హాల్ స్థలం అక్రమాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం.మాల సంఘం సభ్యులు

ఢిల్లీ సీబీఐ కార్యాలయం నుంచి కవితకు నోటీసులు జారీ చేశారు. లిక్కర్ స్కామ్లో వివరణ ఇవ్వాలని 160 సీఆర్‌పీసీ కింద సీబీఐ నోటీసులు పంపించింది. ఢిల్లీ, హైదరాబాద్లో ఎక్కడైనా హాజరుకావచ్చని నోటీసుల్లో సీబీఐ అధికారులు పేర్కొన్నారు.

Read More జోరుగా జారే ప్రచారా హోరు

సీబీఐ ప్రత్యేక కోర్టుకు సమర్పించిన ఓ రిమాండ్‌ రిపోర్ట్‌లో కవిత రోల్‌ ఏమిటి? ఆమెతో పాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన అరబిందో ఫార్మా డైరెక్టర్‌ శరత్‌చంద్రారెడ్డి, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఏం చేశారు? ఆప్‌ నేతలకు రూ. 100 కోట్ల ముడుపులను ఎవరు ఇచ్చారు? ఎలా లబ్ధి పొందారు? అనే విషయాలను కోర్టుకు వివరించారు.

కవితతోపాటు శరత్‌ చంద్రారెడ్డి, మాగుంట, మనీశ్‌సిసోడియా.. ఇలా మొత్తం 38 మంది సుమారు 170 ఫోన్లను మార్చారని.. ఆ తర్వాత ఆ ఫోన్లను ధ్వంసం చేశారని, అలా ధ్వంసం చేసిన డివైజ్‌ల విలువ రూ.1.30 కోట్లు ఉంటుందని ఈడీ స్పష్టం చేసింది.

ఈ కేసులో మద్యం వ్యాపారి, మనీశ్‌సిసోడియా కుడిభుజంగా చెప్పే అమిత్‌ అరోరాను ఈడీ బుధవారం అరెస్టు చేసి, సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తి ఎంకే నాగ్‌పాల్‌ ఎదుట హాజరుపరిచింది. మున్ముందు తెలంగాణలో రాజకీయం మరింత రసవత్తరంగా మారనుంది.

Views: 0
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

జిల్లా ప్రథమ పౌరుడు అయినా సామాన్యుడే జిల్లా ప్రథమ పౌరుడు అయినా సామాన్యుడే
*జిల్లా ప్రధమ పౌరుడు అయినా సామాన్యుడే**హంగు అర్బాటాలు లేవు అధికారం ఉందని గర్వం లేదు* మహబూబాబాద్ పట్టణంలోని ఓ పోలింగ్ కేంద్రంలో సామాన్యుల వలే లైన్ లో...
ఓటు హక్కును వినియోగించుకున్న గ్రామ సర్పంచ్
రూ.1,072 కోట్ల విలువైన కొత్త పరిశ్రమలకు శంకుస్థాపన చేసిన సీఎం జగన్
ఆడుదాం ఆంధ్ర- ఈ ఆట మనందరిది- ఒలింపిక్ పతకాల విజేత పీవీ సింధు
అండగా ఉంటా.... సమస్యలు తీరుస్తా....
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం దక్కించుకునే అవకాశాలు చాలా ఎక్కువ శాతం ఉంది
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ దాటితే