మహిళా న్యాయవాదుల కోసం ఆరోగ్య అవగాహన
మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని కార్యక్రమం
భద్రాద్రి కొత్తగూడెం(న్యూస్ఇండియా బ్యూరో) మార్చి 11 :అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని న్యాయవాది పరిషత్ తెలంగాణ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా యూనిట్ ఆధ్వర్యంలో బుధవారం మహిళా న్యాయవాదుల కోసం ఆరోగ్య అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు .కొత్తగూడెం బార్ అసోసియేషన్ లైబ్రరీ హాల్‌లో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రముఖ వైద్యురాలు డాక్టర్ గుర్రం భావితా రెడ్డి (ఎంబిబిఎస్, ఎమ్మెస్ – గైనకాలజీ, గోల్డ్ మెడలిస్ట్, ల్యాపరోస్కోపీ మరియు ఇన్ఫర్టిలిటీ నిపుణురాలు) పాల్గొన్నారు.ఈ సందర్భంగా డాక్టర్ భావితా రెడ్డి మాట్లాడుతూ మహిళల్లో సాధారణంగా కనిపించే ఆరోగ్య సమస్యలు, వాటి నివారణ చర్యలు, సమయానికి వైద్య పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం, ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని పాటించడం వంటి అంశాలపై వివరంగా అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్‌కు చెందిన మహిళా, పురుష న్యాయవాదులు పాల్గొన్నారు.

Comment List