ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక

99 రోజుల కార్యచరణ ప్రణాళిక

On
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక

ముఖ్యఅతిథిగా పాల్గొన్న కలెక్టర్ అంకిత్

భద్రాద్రిIMG20260312132033
IMG20260312105815 కొత్తగూడెం(న్యూస్ఇండియా ప్రతినిధి)మార్చి 12: కొత్తగూడెం పట్టణంలోని కొత్తగూడెం క్లబ్లో గురువారం  ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక,99 రోజుల కార్యచరణ ప్రణాళిక కార్యక్రమాన్ని సంబంధించి జిల్లాలో నూతనంగా ఏర్పడిన సర్పంచులు, మున్సిపల్ కౌన్సిలర్లు, మున్సిపల్ చైర్ పర్సన్స్, కార్పొరేటర్లకు, ప్రభుత్వ పథకాలపై ఒకరోజు శిక్షణ తరగతులను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ అంకిత్ ముఖ్య అతిథిగా పాల్గొని, ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సందర్శించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. తెలంగాణలోని 33జిల్లాలో  ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తుందన్నారు. 3 స్థాయిలలో 99 రోజుల కార్యచరణ ప్రణాళిక నిర్వహిస్తున్నామన్నారు .అన్ని శాఖలను సమన్వయం చేస్తూ, 11 అంశాలపై కార్యక్రమం ఉంటుందన్నారు. ఈ తరగతిలను ప్రజా ప్రతినిధులు అవగాహన కల్పించుకొని ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందేలా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ వేణుగోపాల్, ట్రైన్ కలెక్టర్ హేమంత్ శర్మ, డిఆర్డిఏ విద్యా చందన, జిల్లా పరిషత్ సీఈవో నాగలక్ష్మి, అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడే గణేష్, డిప్యూటీ మేయర్ సిరిపురపు లలిత కుమారి,ఆర్డీవోమధు , జిల్లా గ్రంథాలయ చైర్మన్ పసుపులేటి వీరబాబు, కార్పొరేషన్ కమిషనర్ సుజాత, డిఎంహైచ్ఓ, భద్రాచలం ఎంవిఐ వెంకట పుల్లయ్య, ఇతర ఉన్న అధికారులు పాల్గొన్నారు.

 

 

Views: 143
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

పేద ప్రజలకు అరుదైన వైద్యం శ్రీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పేద ప్రజలకు అరుదైన వైద్యం శ్రీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్
ఖమ్మం మే 1 ఖమ్మం న్యూస్ ప్రతినిధి: ప్రస్తుతం ఉన్న కాలంలో వైద్యం అంటే ప్రజలు అడలెత్తిపోతున్నారు.వైద్యం పేరుతో కార్పోరేట్ వ్యవస్థ పేద ప్రజలను పట్టిపీడిస్తున్నాయి.ఖమ్మం నగరంలో...
కేసరిగుట్టలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం ఘనంగా
పది ఫలితాలలో త్రివేణి ప్రభంజనం
కలెక్టరేట్లో ఘనంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతోత్సవాలు 
జిల్లా వ్యాప్తంగా పోలీసుల నాకాబందీ
ఆర్టీసీలో సమ్మె సైరన్ 
ఆర్టీసీలో సమ్మె సైరన్