మద్యంతో కొడుకునే కోల్పోయానన్న కేంద్ర మంత్రి

On

మద్యంతో జరిగే దుష్పరిణామాలపై అన్నీ ఇన్నీ కావు. మద్యానికి బానిసైన తన కుమారుడి ప్రాణాలు కాపాడుకోలేకపోయానంటూ ఓ కార్యక్రమంలో కేంద్రమంత్రి కౌషల్ కిషోర్ కంటతడి పెట్టారు. తాను ఎంపీగా ఉన్నప్పుడు తన భార్య ఎమ్మెల్యేగా ఉండేదని, అయినప్పటికీ సొంత కొడుకుని కాపాడుకోలేకపోయామని, అలాంటప్పుడు సామాన్యుడి పరిస్థితి ఏంటని అన్నారు. తన కుమారుడు ఆకాష్ కిషోర్‌కు ఫ్రెండ్స్‌తో కలిసి మందు తాగే అలవాటు ఉందని ఆ అలవాటు మానుతాడనే ఆశతో డి-అడిక్షన్ సెంటర్‌లో చేర్చామని చెప్పారు. ఆరు నెలల […]

మద్యంతో జరిగే దుష్పరిణామాలపై అన్నీ ఇన్నీ కావు. మద్యానికి బానిసైన తన కుమారుడి ప్రాణాలు కాపాడుకోలేకపోయానంటూ ఓ కార్యక్రమంలో కేంద్రమంత్రి కౌషల్ కిషోర్ కంటతడి పెట్టారు.

తాను ఎంపీగా ఉన్నప్పుడు తన భార్య ఎమ్మెల్యేగా ఉండేదని, అయినప్పటికీ సొంత కొడుకుని కాపాడుకోలేకపోయామని, అలాంటప్పుడు సామాన్యుడి పరిస్థితి ఏంటని అన్నారు.

తన కుమారుడు ఆకాష్ కిషోర్‌కు ఫ్రెండ్స్‌తో కలిసి మందు తాగే అలవాటు ఉందని ఆ అలవాటు మానుతాడనే ఆశతో డి-అడిక్షన్ సెంటర్‌లో చేర్చామని చెప్పారు.

ఆరు నెలల తర్వాత వివాహం కూడా చేశాం. అయితే, పెళ్లి తర్వాత మళ్లీ మందుతాగడం మొదలుపెట్టాడు. దురదష్టవశాత్తూ తాగుడు వల్లే ప్రాణాలు కోల్పోయాడు.

రెండేళ్ల క్రితం అక్టోబర్ 19న నా కొడుకు కాలం చేసేనాటికి అతనికి రెండేళ్ల పిల్లవాడు ఉన్నాడు” అని కౌషల్ కిషోర్ చెప్పారు.

తన కొడుకును కాపాడుకోలేకపోయాయని, కోడలుకు వైధవ్యం వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశాడు.

ఇలాంటి దురదృష్టకర పరిస్థితి రాకుండా మీ కూతుళ్లు, అక్కాచెల్లెళ్లను కాపాడుకోవాలని కార్యక్రమనికి హాజరైన వారికి ఆయన సూచించారు.

Views: 6
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News

హెల్మెట్ పెట్టుకొని వాహనం నడుపుతానని ప్రతిజ్ఞ చేస్తున్న హెల్మెట్ పెట్టుకొని వాహనం నడుపుతానని ప్రతిజ్ఞ చేస్తున్న
డోర్నకల్ ఏప్రిల్ 14 న్యూస్: డోర్నకల్ మండలం వెన్నారం గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్135 జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.గ్రామ సర్పంచ్ జక్కుల కౌసల్య అంబేద్కర్ విగ్రహానికి...
ఇంటర్ ఫలితాలలో వెలాసిటీ కళాశాల విజయకేతనం
ఖమ్మంలో వెలాసిటీ కళాశాలలో ఎదురులేని ఫలితాలు
మహిళ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా కళాశాల వార్షికోత్సవ వేడుకలు
ఆపదలో ఆపన్నహస్తం....!!
యువ నాయకత్వానికి ప్రతీక బంటి అన్న..
ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి ఉత్సవాలు..