తెలంగాణకు నూతన డీజీపీ
తెలంగాణ ఇన్‌ఛార్జ్ డీజీపీగా అంజనీ కుమార్ నియమితులయ్యారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఉత్తర్వులిచ్చారు. ప్రస్తుత డీజీపీ మహేందర్ రెడ్డి పదవీ కాలం రేపటితో ముగియనుంది. ఆయన నుంచి అంజనీకుమార్ బాధ్యతలు స్వీకరిస్తారు. అంజనీకుమార్ బదిలీతో ఖాళీ అయిన స్థానంలో హోంశాఖ ముఖ్య కార్యదర్శి రవిగుప్తాను నియమించారు. ఆయనకు విజిలెన్స్ డీజీగా అదనపు బాధ్యతలు అప్పగించారు. శాంతిభద్రతల అదనపు డీజీ డాక్టర్ జితేందర్‌ను హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా.. రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్‌ను సీఐడీ డీజీగా […]
తెలంగాణ ఇన్‌ఛార్జ్ డీజీపీగా అంజనీ కుమార్ నియమితులయ్యారు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఉత్తర్వులిచ్చారు.
ప్రస్తుత డీజీపీ మహేందర్ రెడ్డి పదవీ కాలం రేపటితో ముగియనుంది.
ఆయన నుంచి అంజనీకుమార్ బాధ్యతలు స్వీకరిస్తారు. అంజనీకుమార్ బదిలీతో ఖాళీ అయిన స్థానంలో హోంశాఖ ముఖ్య కార్యదర్శి రవిగుప్తాను నియమించారు.
ఆయనకు విజిలెన్స్ డీజీగా అదనపు బాధ్యతలు అప్పగించారు.
శాంతిభద్రతల అదనపు డీజీ డాక్టర్ జితేందర్‌ను హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా.. రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్‌ను సీఐడీ డీజీగా బదిలీ చేశారు
. హైదరాబాద్ శాంతిభద్రతల అదనపు కమిషనర్ దేవేంద్ర సింగ్ చౌహాన్‌ను రాచకొండ కమిషనర్‌గా.. ప్రొవిజన్స్ అండ్ లాజిస్టిక్స్ అదనపు డీజీ సంజయ్ కుమార్ జైన్‌ను శాంతిభద్రతల అదనపు డీజీగా నియమించారు.
డీజీపీ మహేందర్‌రెడ్డి కొంతకాలం అనారోగ్యంతో సెలవులో ఉన్న సమయంలోనూ అంజనీకుమార్ ఇన్‌చార్జి డీజీపీగా సేవలందించారు
. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన నాటి నుంచి హైదరాబాద్ పోలీసు కమిషనర్‌ను డీజీపీగా నియమించడం ఓ ఆనవాయితీగా మారింది. అనురాగ్‌శర్మ, మహేందర్‌రెడ్డి అలా హైదరాబాద్ సీపీ స్థానం నుంచి డీజీపీలుగా బాధ్యతలు చేపట్టారు.
ఉమ్మడి ఏపీలో పలుమార్లు కొనసాగిన ఆనవాయితీ ప్రకారం ఈ సారి ఏసీబీ డీజీని డీజీపీగా నియమించారు.
About The Author

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Comment List