పీలే ఇక లేరు

On

బ్రెజిల్‌ లెజెండరీ ఫుట్‌బాల్ ప్లేయర్ పీలే కన్నుమూశారు. ఆయన చాలా కాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. పీలే మరణాన్ని ఆ‍యన కుమార్తె ధృవీకరించింది. పీలే తన దేశమైన బ్రెజిల్‌ను మూడుసార్లు ప్రపంచ ఛాంపియన్‌గా మార్చాడు. 82 ఏళ్ల వయసున్న పీలే… కొంతకాలంగా ఆస్పత్రిలో క్యాన్సర్‌తో పోరాడుతూ తుదిశ్వాస విడిచారు. 20వ శతాబ్దపు గొప్ప ఫుట్‌బాల్ క్రీడాకారుడు పీలే.. పెద్దపేగు క్యాన్సర్‌తో బాధపడ్డారు. పీలే మరణం ఫుట్‌బాల్ ప్రేమికులకు దిగ్భ్రాంతి కలిగించింది. సోషల్ మీడియాలో అభిమానులంతా ఫుట్‌బాల్ హీరోకి చివరి […]

బ్రెజిల్‌ లెజెండరీ ఫుట్‌బాల్ ప్లేయర్ పీలే కన్నుమూశారు. ఆయన చాలా కాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్నారు.

పీలే మరణాన్ని ఆ‍యన కుమార్తె ధృవీకరించింది. పీలే తన దేశమైన బ్రెజిల్‌ను మూడుసార్లు ప్రపంచ ఛాంపియన్‌గా మార్చాడు. 82 ఏళ్ల వయసున్న పీలే… కొంతకాలంగా ఆస్పత్రిలో క్యాన్సర్‌తో పోరాడుతూ తుదిశ్వాస విడిచారు.

20వ శతాబ్దపు గొప్ప ఫుట్‌బాల్ క్రీడాకారుడు పీలే.. పెద్దపేగు క్యాన్సర్‌తో బాధపడ్డారు. పీలే మరణం ఫుట్‌బాల్ ప్రేమికులకు దిగ్భ్రాంతి కలిగించింది.

సోషల్ మీడియాలో అభిమానులంతా ఫుట్‌బాల్ హీరోకి చివరి వీడ్కోలు పలుకుతున్నారు.

బ్రెజిల్ 1958, 1962, 1970లో పీలే నేతృత్వంలో ప్రపంచకప్‌ను గెలుచుకుంది.

అతను మొత్తం 4 ప్రపంచకప్‌లు ఆడాడు. అందులో మూడు గెలిచారు. మూడు ప్రపంచకప్‌లు గెలిచిన ఏకైక ఆటగాడిగా పీలే నిలిచాడు. 1971లో బ్రెజిల్ జాతీయ జట్టు నుంచి రిటైరయ్యాడు.

పీలే తన వృత్తి జీవితంలో మొత్తం 13 వందల 63 మ్యాచ్‌లు ఆడి 12 వందల 81 గోల్స్ చేశాడు.

బ్రెజిల్ తరపున 91 మ్యాచ్‌ల్లో 77 గోల్స్ చేశాడు. 1999లో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీచే పీలే శతాబ్దపు అథ్లెట్‌గా ఎంపికయ్యాడు.

ఇప్పుడు ఆయన మరణవార్త విన్న ఫుట్‌బాల్‌ ప్రేమికులు, అభిమానులు శోకసంద్రంలో మునిగారు.

Views: 8
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News

కల్లోజిని పరామర్శించిన ఎంపీ వద్దిరాజు కల్లోజిని పరామర్శించిన ఎంపీ వద్దిరాజు
కొత్తగూడెం(న్యూస్ఇండియానరేష్) అక్టోబర్ 21:టియుడబ్ల్యూజే టి జె ఫ్ జిల్లా అధ్యక్షులు,ఆంధ్ర జ్యోతి సీనియర్ రిపోర్టర్ కల్లోజి శ్రీనివాస్ మాతృ మూర్తి కొద్దిరోజులు క్రితం చనిపోయారు. విషయం తెలుసుకున్న...
PRTU TS సంఘంలోకి ఆహ్వానించి సభ్యత్వనమోదు కార్యక్రమం
పోలీస్ అమరవీరులకు నివాళులు అర్పించి శ్రద్ధాంజలి ఘటించిన, జిల్లా కలెక్టర్, జిల్లా యస్ పి
భద్రాద్రి కొత్తగూడెంలో ఘనంగా పోలీస్ అమరవీరుల సంస్కరణ దినం
. పేదల ఇళ్ల జోలికి వెళ్ళకు. నా ఇల్లు కూలగొట్టుకో..
దుమ్ము, ధూళి నుంచి కాపాడండి..
పాలకుర్తి ఎంపీడీవో కార్యాలయం లో పాలకుర్తి గ్రామ మంచినీటి సహాయక ధ్రువీకరణ సర్టిఫికెట్ల అందజేత*