
*నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలి* *
విద్యార్థులు నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలని వికాస్ హై స్కూల్ కరస్పాండెంట్ తాళ్లపల్లి రమేష్ అన్నారు.
డివిజన్ కేంద్రంలోని వికాస్ హై స్కూల్ లో స్టూడెంట్ కౌన్సిల్ ఎన్నికలు నిర్వహించారు.
విద్యార్థులకు నమూనా పోలింగ్ నిర్వహించి, తద్వారా ఓటింగ్, ఎన్నికల విధానం పై అవగాహన కల్పించారు. విద్యార్థులు ఉత్సాహంగా నమూనా ఎన్నికల్లో పాల్గొన్నారు. తొర్రూరు కౌన్సిలర్లు పలువురు విద్యార్థులు నామినేషన్లు వేయడంతో పాటు బ్యాలెట్ పేపరు ద్వారా ఓటు వేయడం, ఓట్ల లెక్కింపు, ఎన్ని కల్లో గెలుపొందిన విద్యార్థులకు ధృవీకరణ పత్రాలు అందజేయడం వంటి అంశాలపై అవ గాహన కల్పించారు. ఓటర్లుగా, అభ్యర్థులుగా, ఎన్నికల అధికారులుగా, పోలీసులుగా విద్యార్థులు వ్యవహరించారు. దీంతో పాఠశాలలో ఎన్నికల వాతావరణం నెలకొంది.
ఈ సందర్భంగా కరస్పాండెంట్ తాళ్లపల్లి రమేష్ మాట్లాడుతూ... ఎన్నికల విధానంపై విద్యార్థులకు అవగాహన అవసరమని, భవిష్యత్తులో విద్యార్థులే దేశానికి నాయకత్వం వహిస్తారని తెలిపారు.
ఎన్నికల విధానం తెలియడం ద్వారా నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయని గుర్తు చేశారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రెసిడెంట్ రేవూరి వెంకన్న, డైరెక్టర్ కేవీ రెడ్డి, విజయభాస్కర్, శ్రీలత, ప్రిన్సిపాల్ వేణుమాధవ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
About The Author
Related Posts
Post Comment
Latest News

Comment List