అంగన్వాడీలకు కనీస వేతనం అమలు చేయాలి  మాల మహానాడు రాష్ట్ర పోలిట్ బ్యూరో చైర్మన్ ఆ శోద భాస్కర్

అంగన్వాడీలకు కనీస వేతనం అమలు చేయాలి  మాల మహానాడు రాష్ట్ర పోలిట్ బ్యూరో చైర్మన్ ఆ శోద భాస్కర్

IMG-20230923-WA0159
రాష్ట్రంలో అంగన్వాడీ కేంద్రాల్లో పని చేస్తున్న కార్యకర్తలు, ఆయాలకు కనీస వేతనం అమలు చేయాలని జాతీయ మాల మహానాడు రాష్ట్ర పోలిట్ బ్యూరో చైర్మన్ అసోద భాస్కర్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. శనివారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ఎదుట 13 రోజులుగా అంగన్వాడీలు చేస్తున్న నిరవధిక దీక్షకు మాల మహానాడు ఆధ్వర్యంలో సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు కారం ప్రశాంత్ తో కలిసి మాట్లాడుతూ చాలీచాలని వేతనంతో ఎన్నో ఏళ్లుగా గర్భిణీలు, బాలింతలు పిల్లలకు ప్రభుత్వం అందించే ఆహార పదార్థాలను అందిస్తూ సేవ చేస్తున్న అంగన్వాడీలను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలన్నారు. వారి న్యాయమైన డిమాండ్లు పరిష్కరించకుంటే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు గ్రామ శాఖ అధ్యక్షులు బూరుగుల రజిని కుమార్, నేతలు మద్దెల రమేష్, బాణాల సంజీవ, బొడ్డు రమేష్, గారా అనిల్, అంగన్వాడి కార్యకర్తలు ఆయాలు తదితరులు ఉన్నారు.

Views: 87
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News

రేపటి భవిష్యత్తు వినూత్నంగా ఆలోచించే విద్యార్థులదే రేపటి భవిష్యత్తు వినూత్నంగా ఆలోచించే విద్యార్థులదే
ఖమ్మం, రఘునాథపాలెం లోని బిసి గురుకుల డిగ్రీ కళాశాలలో వేదికగా జరిగిన సైన్స్ ఫెయిర్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కళాశాల ప్రిన్సిపాల్ నాగేశ్వర రావు పాల్గొని ప్రసంగించారు....
జిల్లా పోలీసు హెడ్ క్వార్టర్స్ లో ఘనంగా హోలీ 
పార్లమెంట్ సభ్యులుగా మారిన డిగ్రీ మహిళ విద్యార్థులు
చంద్రగ్రహణం సందర్భంగా రేపు పెద్దమ్మ గుడి మూసివేత
మన్నెగూడలోని ఎస్ఆర్ హ్యాచరీస్ పై రైతుల ఆగ్రహం..
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడును మర్యాదపూర్వకంగా కలిసిన నీరుకొండ ఉషారాణి
అభినవ్ హై స్కూల్ లో ఘనంగా స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ (SLC),హై స్కూల్ సైన్స్ ఎక్సపో