
ప్రవేట్ విద్యాసంస్థలలో జర్నలిస్ట్ పిల్లలకి 50 శాతం రాయితీ కల్పించాలి
టీజే ఎస్ ఎస్ డిమాండ్
కనిగిరి న్యూస్ ఇండియా
ప్రవేటి విద్యాసంస్థలలో చదువుకునే జర్నలిస్టుల పిల్లలకు ఫీజుల విషయం భారంగా మారింది. మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సామాన్య ప్రజలకు కార్పొరేట్ విద్య అందుబాటులో ఉందాలనే సదుద్దేశంతో ప్రవేటి విద్యాసంస్థలలో ఫీజు నియంత్రణ ఉత్తర్వులు జారీ చేసినా వివిధ కారణాలతో అమలు కావడంలేదు. అని ప్రకాశం జిల్లా కలెక్టర్ కు తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు నేలపాటి రవి అన్నారు. సోమవారం స్పందన కార్యక్రమంలో అయినా మాట్లాడుతూ జర్నలిస్టుల స్థితిగతులు, జీవన ప్రమాణాలు తెలిసి సహృదయంతో ఆయా ప్రకాశం జిల్లా కలెక్టర్ లు, జర్నలిస్టుల పిల్లలకు ప్రయివేటు విద్యా సంస్థలలో 50 శాతం ఫీజు రాయితీ కల్పిస్తూ గతంలో ఉత్తర్వులు జారీచేశారు. ఇప్పటికీ అమలులో ఉన్నప్పటికీ పలు ప్రయివేటు పాఠశాలలు అమలు చేయడంలేదు. దీనితో ఎటువంటి వేతనాలు లేక సమాజశ్రేయస్సు కోసం పరితపించే జర్నలిస్టులకు విచ్చలవిడిగా ఫీజులు పెంచుకుంటూ పోయిన పలు విద్యాసంస్థలలో తమ బిడ్డలను చదివించుకోలేక సగటు జర్నలిస్టు ఇబ్బందులకు గురవుతున్నారు. అలాగే జర్నలిస్టుల జీవన విధానం ఎప్పటికి దారిద్ర్యరేఖకు దిగువగానే ఉంటుంది. కావున తమరు ఈ విధానాన్ని కూడా పరిగణలోకి తీసుకుని ప్రయివేట్ పాఠశాలలో బీపీఎల్ క్రింద జర్నలిస్టుల బిడ్డలకు 50శాతం ఫీజు ఆయా పాఠశాలలు చక్కగా అమలు చేసే విధంగా చర్యలు తీసుకోగలరు. ఇప్పటికే పాఠశాలలు ప్రారంభం అయ్యాయి. కావున జర్నలిస్టుల పిల్లల చదువులకు ఆసరాగా ఉన్న 50శాతం ఫీజు రాయితీ విషయంలో ప్రకాశం జిల్లా పరిధిలోని ప్రవేట్ విద్యాసంస్థలు చక్కగా అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం సభ్యులు ఏడుకొండలు, శ్రీనివాసులు రెడ్డి, మాధవరావు, వీర నారాయణ తదితరులు పాల్గొన్నారు.
About The Author
Related Posts
Post Comment
Latest News

Comment List