ఏకలవ్య స్కూలు కు భూమి

పాల్గొన్న మంత్రి సత్యవతి రాథోడ్ ఎంపీ కవిత ఎమ్మెల్యే శంకర్ నాయక్

On
ఏకలవ్య స్కూలు కు భూమి

గూడూరు కల నెరవేరింది: మంత్రి సత్యవతి రాథోడ్

గూడూరు మండల కేంద్రంలోని చంద్రుగూడెం లో ఏకలవ్య గురుకుల పాఠశాల భూమి పూజలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీ కవిత, ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ పూజలో పాల్గొన్నారు. మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ గూడూరుకు మూడు సంవత్సరాల క్రితమే ఏకలవ్య గురుకుల పాఠశాల భవన నిర్మాణానికి 35 కోట్లు మంజూరయ్యాయని స్థల వివాదానికి రావడం వల్ల ఆలస్యమైందే తప్ప గూడూరు మండలం ఏజెన్సీ మండలం పేద విద్యార్థులు ఉంటారని వారికి మంచి విద్యను అందించాలని  రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేస్తే కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలుపుతుంది రాష్ట్ర ప్రభుత్వం స్థలం కేటాయించింది. 75 సంవత్సరాల నుండి 91 గురుకుల పాఠశాలలు ఉంటే తెలంగాణ వచ్చి తొమ్మిదేళ్లలో 98 గురుకుల పాఠశాలకు చేరుకున్నది. 188 గురుకుల పాఠశాలలు ఉంటే అందులో కేంద్ర ప్రభుత్వంతో నడిచే 23 ఈఎంఆర్ఆస్ తో కలిసి పనిచేస్తున్నాయని అదే విధంగా విద్యార్థులకు అవసరమైన మంచి ఆహారం,వసతులు, గురుకుల పాఠశాలకు విద్యార్థులు వస్తే మంచి చదువు, నైపుణ్యం గల శిక్షణ గురుకుల పాఠశాలలో నేర్పిస్తారని మా బిడ్డల భవిష్యత్తు బంగారు భవిష్యత్తుగా తీర్చిదిద్ది మా పిల్లలు బయటకు వస్తారని విద్యార్థుల తల్లిదండ్రులు అనుకుంటున్నారని మంత్రి సత్యవతి రాథోడ్ కార్యక్రమంలో అన్నారు. కార్యక్రమంలో జెడ్పి చైర్మన్ అంగోత్ బిందు, జెడ్పి కో ఆప్షన్ ఎం.డి.ఖాసీం, మహబూబ్ పాషా,ఎంపిపి సుజాత మోతిలాల్,జెడ్పిటిసి సుచిత్ర, మండల అధ్యక్షులు వెంకట్ కృష్ణ రెడ్డి, మండల  గ్రామ భారస నాయకులు, అధికారులు మరియు తదితరులు పాల్గొన్నారు.IMG-20230925-WA0599

Views: 193
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News