
గొల్ల బాబూరావుకు సర్వే దెబ్బ.. ఈ సారి నో టికెట్
బాబూరావు దారెటు?
పాయకరావుపేటలో టీడీపీని ఢీకొట్టే వైసీపీ కొత్త అభ్యర్ధి ఎవరు?
:అధికార వైసీపీ చేయిస్తున్న సర్వేలు.. సిట్టింగ్ ఎమ్మెల్యేల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తున్నాయి. ఇప్పటివరకు లీకైన సర్వేల ప్రకారం పాయకరావుపేటలో సిట్టింగ్ ఎమ్మెల్యే గొల్ల బాబూరావుకు సీటు దక్కే అవకాశం లేదు. దీనికి కారణం ప్రతిపక్షం, స్వపక్షంలోనూ బాబూరావుపై ఉన్న తీవ్ర వ్యతిరేకతే దీనికి కారణం. బాబూరావును మార్చితేనే పార్టీ బతుకుతుందని లేకుంటే నామరూపాలు లేకుండా పోతుందని వైసీపీ కేడర్ చెబుతున్నట్లు తెలుస్తోంది.
వైసీపీ ఎమ్మెల్యేల్లో సర్వేలు గుబులు రేపుతున్నాయి. సీఎం జగన్ కూడా సర్వేలను బట్టే టికెట్లు ఇస్తానని చెప్పడంతో.. ఆ సర్వేలకు అంత ప్రాధాన్యత ఏర్పడింది. అయితే 2024లో మళ్ళీ వైసీపీ టికెట్లు ఇచ్చేది ఎందరికి అన్నది చూస్తే క్లియర్ గా కొందరికి దక్కవనే అంటున్నారు. వైసీపీ తరచూ చేయిస్తున్న సర్వేలు చూసుకుంటే గత ఏడాదిన్నరగా కొందరు ఎమ్మెల్యేల పనితీరు ఈ రోజుకీ మెరుగుపడలేదని అంటున్నారు. అదే సమయంలో కొందరు పార్టీ ఆదేశానుసారం గడప గడప కూ తిరుగుతున్నా కూడా వారి గ్రాఫ్ పెరగలేదు, అధికార వైసీపీలో ఉత్తరాంధ్రలో కొందరికి సీటు చిరిగే అవకాశం కనపడుతోంది. కొందరికి ఎట్టి పరిస్థితుల్లోనూ టికెట్ ఇవ్వొద్దని వైసీపీ హైకమాండ్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇందులో మొట్ట మొదటగా పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్లబాబూరావు పేరు ఉంది. ఈ సారి గొల్ల బాబూరావుకు టికెట్ దక్కదని బాహాటంగానే చెప్తున్నారు. స్థానిక వ్యతిరేకతతోపాటు సొంత పార్టీ నుంచే బాబూరావుపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అటు వివిధ రకాల సర్వేలు చూసుకుంటే కొంత కాలంగా బాబూరావు గ్రాఫ్ మరింతగా దిగజారినట్లు వైసీపీ హైకమాండ్ గుర్తించింది. పార్టీ ఆదేశానుసారం గడప గడప కూ తిరుగుతున్నా కూడా గ్రాఫ్ పెరగలేదు. ప్రజల నుంచే కాక పార్టీ కార్యకర్తల నుంచి కూడా బాబూరావుకు సహాయనిరాకరణ జరుగుతోంది. బాబూరావు పనితీరు బాగోలేదని ఇప్పటికే నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఒక వేళ ఆయనకు టికెట్ ఇస్తే టీడీపీని గెలిపించనట్టేనని స్థానిక కార్యకర్తలు చెప్తున్నారు. టఫ్ ఫైట్ ఇవ్వలేరని, టీడీపీ కేడర్ తో ఆయన కు సంబంధాలు ఉన్నాయని అంటున్నారు. 2009, 2014, 2019లలో మూడు సార్లు పేట నుంచి గెలిచారు. అయితే ఈసారి మాత్రం ఆయన గెలుపు కష్టమని సర్వేలు తేల్చిన నేపధ్యంలో గొల్ల బాబురావు కు టికెట్ ఇవ్వరని పార్టీనేతలు చెబుతున్నారు.
About The Author

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Related Posts
Post Comment
Latest News

Comment List