బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్‌లోకి భారీగా వలసలు..
రాష్ట్రంలో అవినీతి పాలనను బొందపెట్టాలి..
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడం ఖాయమని, బీఆర్ఎస్‌పై ప్రజా తిరుగుబాటు తప్పదని టీపీసీసీ ఉపాధ్యక్షులు మల్‌రెడ్డి రంగారెడ్డి అన్నారు. శుక్రవారం క్యాంప్ ఆఫీస్ తొర్రూర్ లో టిపిసిసి ఉపాధ్యక్షులు మల్ రెడ్డి రంగారెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన హయత్‌నగర్ సహకార సంఘం సొసైటీ బ్యాంకు డైరెక్టర్ ముత్యాల రాజశేఖర్ రావు, పగడాల నగేష్, భానుచందర్‌లతో పాటు బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో చేరారు. కాంగ్రెస్ పార్టీ చేరిన నాయకులను, కార్యకర్తలను మల్‌రెడ్డి రంగారెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మల్‌రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో అవినీతి పాలనను అంతమోదించేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారన్నారు. ఇబ్రాహీంపట్నం నియోజవకవర్గంలో అవినీతి, భూకబ్జాదారుడైన ఎమ్మెల్యే కిషన్ రెడ్డికి ఓటమి తప్పదన్నారు. ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం జెడ్పీటీసీ భూపతిగళ్ళ మహిపాల్, అబ్దుల్లాపూర్మెట్ జెడ్పీటీసీ బింగి దాస్ గౌడ్, ఇబ్రాహీంపట్నం మున్సిపల్ చైర్‌పర్సన్ కప్పరి స్పవంతి చందు, అధ్యక్ష కార్యద్శులు ఆకుల నందు, దొంతరమోని రాజు, సొప్పరి రవి కుమార్ (టోనీ), ఆదిభట్ల మున్సిపాలిటీ అధ్యక్షులు బాలరాజు గౌడ్, హయత్ నగర్ డివిజన్ అధ్యక్షులు గజ్జి శ్రీనివాస్ యాదవ్, సొసైటీ బ్యాంక్ డైరెక్టర్లు దోమలపల్లి అంజయ్య, జగన్ మోహన్ రెడ్డి, కో ఆప్షన్ సభ్యులు నక్క రాజు గౌడ్, ఇబ్రహీంపట్నం యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు మాంకాల కర్ణాకర్, చింతపట్ల కిరణ్, ముత్యాల సంతోష్, ముత్యాల బాను, నల్లబోలు మాలిక్ రెడ్డి, పెంటయ్య గౌడ్, బల్లేపు సతీష్, ఉప్పు అరవింద్, ఉప్పు రాజేష్, మొహ్మద్ ఇమ్రాన్, కొంకానీ విజయ్ కుమార్ భాను, సాయి, శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
Comment List