కాంగ్రెస్ ఎస్సీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా మహేష్ మహారాజ్
నియామక పత్రాన్ని అందజేసిన టిపీసీసీ ఉపాధ్యక్షులు మల్ రెడ్డి రంగారెడ్డి
On
రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పి. మహేష్ మహారాజ్ ను నియమిస్తూ ఆదివారం నియామక పత్రాన్ని టీపీసీసీ ఉపాధ్యక్షులు మల్ రెడ్డి రంగారెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా మహేష్ మహారాజ్ మాట్లాడుతూ... తనపై నమ్మకంతో నియోజకవర్గ ఎస్సీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతల అప్పగించిన మల్ రెడ్డి రంగారెడ్డి కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తనపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వహించి పార్టీష్టతకు కృషి చేస్తానని తెలిపారు. అదే విధంగా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు ప్రీతం, టీ పీసీసీ రాష్ట్ర కార్యదర్శి భూపతి గల మహిపాల్, చిలుక మధుసూదన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గుర్నాథ్ రెడ్డి, ఎస్సీ సెల్ నియోజకవర్గం అధ్యక్షులు పెంటయ్య లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
Views: 14
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
03 Sep 2026 21:28:10
ప్రతి ఇంటికి ఏదో ఒక రూపంలో సంక్షేమ పథకాలను అందిస్తున్న కాంగ్రెస్ పార్టీ.. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

Comment List