ఏపీలో అందోళనకరంగా ధియేటర్ల పరిస్థితి

On

ఎక్కడైనా ఉన్నవాటికి పోటీగా కొత్తవి పుట్టుకొస్తాయి. మార్కెట్ కాంపిటిషన్‌లో పోటీపడి నిలదొక్కుకుంటాయి. ఏపీలో ఇప్పుడు సినిమా పరిశ్రమ దారుణమైన పరిస్థితి ఎదుర్కొంటోంది. కొత్త ధియేటర్ల మాట అటుంచితే.. ఉన్నవాటినే నడపలేక మూసేస్తున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు సినిమాలు ప్రదర్శించాలంటే ఎదురు తమ జేబుకే చిల్లు పడుతుందనేది యాజమాన్యాల మాట. అఖండ, పుష్ప, శ్యామ్‌సింగరాయ్‌ లాంటి సినిమాల రిలీజ్‌తో మార్కెట్‌కి హౌస్‌ఫుల్‌ టాక్ వచ్చినా కూడా తాము ధియేటర్లు నడపలేమని వారంటున్నారు. తాజాగా ఆసియాలోనే 2వ అతిపెద్ద ధియేటరైన […]

ఎక్కడైనా ఉన్నవాటికి పోటీగా కొత్తవి పుట్టుకొస్తాయి. మార్కెట్ కాంపిటిషన్‌లో పోటీపడి నిలదొక్కుకుంటాయి. ఏపీలో ఇప్పుడు సినిమా పరిశ్రమ దారుణమైన పరిస్థితి ఎదుర్కొంటోంది. కొత్త ధియేటర్ల మాట అటుంచితే.. ఉన్నవాటినే నడపలేక మూసేస్తున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు సినిమాలు ప్రదర్శించాలంటే ఎదురు తమ జేబుకే చిల్లు పడుతుందనేది యాజమాన్యాల మాట.

అఖండ, పుష్ప, శ్యామ్‌సింగరాయ్‌ లాంటి సినిమాల రిలీజ్‌తో మార్కెట్‌కి హౌస్‌ఫుల్‌ టాక్ వచ్చినా కూడా తాము ధియేటర్లు నడపలేమని వారంటున్నారు. తాజాగా ఆసియాలోనే 2వ అతిపెద్ద ధియేటరైన V-ఎపిక్ కూడా మూతపడింది. ఇప్పటికి ఇలా మూతపడిన ధియేటర్ల సంఖ్య 125కి చేరింది. చూస్తుంటే ఇది ఇక్కడితో ఆగేలా కనిపించడం లేదనే ఆందోళన కూడా ఉంది.

తెలంగాణలో పోలిస్తే ఏపీలో ధియేటర్లు చాలా ఎక్కువ. దాదాపు వెయ్యి ధియేటర్లు రాష్ట్రవ్యాప్తంగా ఉంటే.. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవన్నీ ఇప్పుడు క్లోజ్ చేసేసి కల్యాణ మండపాలుగా మారిపోయే ప్రమాదం కనిపిస్తోంది.

Views: 1
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

నాలుగు లేబర్ కోడ్ లు కార్మికులకు ఉరితాళ్ళు నాలుగు లేబర్ కోడ్ లు కార్మికులకు ఉరితాళ్ళు
        నాలుగు లేబర్ కోడ్ లు కార్మికులకు ఉరితాళ్లు. లేబర్ కోడ్ ల రద్దుకై 23 మహ.బాద్ లో రాష్ట్ర సదస్సును జయప్రదం చేయండి.    ఐఎఫ్ టియు
కాంగ్రెస్ విజయం
నీట్ పరీక్ష రద్దు చేయండి
రైతుల దగ్గర నిల్వ ఉన్న అదనపు పొగాకును కొనుగోలు చేయాలి: బడుగు వెంకటేశ్వర్లు
అంతర్జాతీయ యోగా దినోత్సవం శుభాకాంక్షలు
పదవులలో పాలకవర్గం
పదవులలో పాలకవర్గం బాధ్యతలు