పార్టీ కార్యక్రమాలకు దూరంగా గొల్ల బాబూరావు?

పేటలో అసలేం జరుగుతోంది

On
పార్టీ కార్యక్రమాలకు దూరంగా గొల్ల బాబూరావు?

 

టైమ్స్ నౌ సర్వేతో జోరు మీదున్న వైఎస్ఆర్ సీపీ పార్టీకి కొంతమంది ఎమ్మెల్యేల పని తీరు తలనొప్పిగా మారింది.  పార్టీ కార్యక్రమాలకే కాకుండా ప్రభుత్వ కార్యక్రమాలకు దూరంగా ఉండటం ఇబ్బందిగా మారింది.  మరీ ముఖ్యంగా అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో సిట్టింగ్ ఎమ్మెల్యే పనితీరు మరీ ఘోరంగా ఉంది. కేడర్ బలంగా ఉన్నా స్థానికంగా ఎమ్మెల్యేకు సరైన మద్దతు లేకపోవడంతో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. మిగిలిన నియోజకవర్గాల్లో కార్యక్రమాలు జోరుగా సాగుతున్నా పాయకరావుపేటలో మాత్రం పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టే ఏ ఒక్క కార్యక్రమం కూడా జరగకపోవడం కేడర్ ను నిరాశాల్లోకి నెడుతోంది.
ఈ సారి తనకు సర్వేలన్నీ వ్యతిరేకంగా ఉండటంతో పార్టీ టికెట్ ఇవ్వదని తెలియడంతోనే ఎమ్మెల్యే గొల్ల బాబూరావు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికిప్పుడు ఇదే విషయమై స్పందిస్తే పార్టీకి డ్యామేజీ అవుతుందనే ఆలోచనలో పార్టీ హైకమాండ్ ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఆచి తూచి వ్యవహరిస్తోంది.  సమయం వచ్చినప్పుడు తగిన చర్యలు తప్పవని సొంత పార్టీ నేతలే చెబుతుండటం దీనికి బలం చేకూరుస్తోంది.WhatsApp Image 2023-10-04 at 5.28.09 PM

Views: 99
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News

మాదకద్రవ్యాల పై విద్యార్థులకు  అవగాహన కార్యక్రమం నిర్వహించిన ఎస్సై ప్రవీణ్ కుమార్ మాదకద్రవ్యాల పై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించిన ఎస్సై ప్రవీణ్ కుమార్
            చుంచుపల్లి  (న్యూస్ ఇండియా నరేష్) జూలై 18: చెడు అలవాట్లతో భవిష్యత్‌ నాశనమ వుతుందని, మాదకద్రవ్యాల నివారణకు సమష్టిగా కృషి చేయాలని చుంచుపల్లి ఎస్ఐ ప్రవీణ్
రైతు రుణమాఫీ అమలుకు పకడ్బందీ చర్యలు
మాదకద్రవ్యాల నిర్మూలన కోసం విద్యార్థులతో ర్యాలీ
ఏళ్ల చరిత్ర గల పీర్ల పండుగ...
భారతీయ జనతా పార్టీ మండల నూతన కార్యవర్గం ఎన్నిక
గంజాయి తరలిస్తున్న ముగ్గురుని అరెస్టు చేసిన టూ టౌన్ పోలీసులు
ఘనంగా కేంద్ర రక్షణ సహాయ మంత్రి బండి సంజయ్ జన్మదిన వేడుకలు.