మరోసారి ప్రోటోకాల్ పాటించని అధికార పార్టీ..

కౌన్సిలర్ ఇంటికి వెళ్లి పరామర్శించిన టిపిసిసి ఉపాధ్యక్షులు మల్ రెడ్డి రంగారెడ్డి..

On
మరోసారి ప్రోటోకాల్ పాటించని అధికార పార్టీ..

IMG-20231006-WA1909
టిపిసిసి ఉపాధ్యక్షులు మల్ రెడ్డి రంగారెడ్డి, కాంగ్రెస్ నాయకులు

ప్రోటోకాల్ వివాదంలో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ కి గాయాలు పలువురు కాంగ్రెస్ నాయకులను పోలీసులు అరెస్టు చేసి ఆదిభట్ల స్టేషన్కు తరలించారు. పోలీసుల తీరుపై మల్రెడ్డి రంగారెడ్డి అబ్రహం వ్యక్తం చేశారు. తుర్కయాంజల్ మున్సిపాలిటీలో అధికార పార్టీ మరోసారి తన అధికారన్నీ ప్రదర్శించింది. ప్రోటోకాల్ లేకుండా అభివృద్ధి కార్యక్రమాలను ఇష్టానుసారంగా నిర్వహిస్తుండడంతో కాంగ్రెస్ కౌన్సిలర్లు అధికార పార్టీ నాయకులను నిలదీశారు. ఈ ఘర్షణలో కాంగ్రెస్ కౌన్సిలర్ కుంట ఉదయశ్రీ కాలికి తీవ్రమైన గాయమైంది పలువురు కాంగ్రెస్ నాయకులను ఆదిభట్ల పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక నాయకుల ద్వారా విషయం తెలుసుకున్న టిపిసిసి ఉపాధ్యక్షులు మల్ రెడ్డి రంగారెడ్డి కౌన్సిలర్ ఇంటికి వెళ్లి పరామర్శించారు. అనంతరం ఆదిభట్ల పోలీస్ స్టేషన్ కి వెళ్లి పోలీసులతో మాట్లాడి కాంగ్రెస్ నాయకులను విడిపించారు.

*పోలీసుల తీరుపై అగ్రహ వ్యక్తం చేసిన టిపిసిసి మల్రెడ్డి రంగారెడ్డి..*

అన్యాయంగా కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేయడం ఏమిటని ఆదిభట్ల సీఐని మల్రెడ్డి రంగారెడ్డి నిలదీశారు. పోలీసులు అధికార పార్టీ కార్యకర్తల్లాగా పనిచేస్తున్నారని అన్నారు. అధికారం ఎవరికి శాశ్వతం కాదని పోలీసులు ప్రజల వైపు న్యాయం వైపు ఉండాలని అన్నారు. అధికార పార్టీ కనుసైగలు పనిచేస్తే ప్రజల నుండి భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. మరోసారి కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలపై అక్రమ కేసులు పెడితే చూస్తూ ఊరుకోమని అన్నారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఈసీ శేఖర్ గౌడ్ మామ, టిపిసిసి క్యాంపనింగ్ కమిటీ మెంబర్ కొత్తకుర్మ శివకుమార్, కౌన్సిలర్లు, వివిధ మండల మున్సిపల్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Views: 251

About The Author

Post Comment

Comment List

Latest News

ఘనంగా యువ జర్నలిస్టు యేసేబు పుట్టినరోజు వేడుకలు ఘనంగా యువ జర్నలిస్టు యేసేబు పుట్టినరోజు వేడుకలు
యర్రగొండపాలెం యువ జర్నలిస్టు ఉప్పలపాటి యేసేబు పుట్టినరోజు వేడుకలు బుధవారం యర్రగొండపాలెంలో సహచర జర్నలిస్టుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు జర్నలిస్టులు మాట్లాడుతూ యువ...
రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తాం
ఏఈఓ ల మీద సస్పెన్షన్ ఎత్తివేయాలి
హరిపిరాల గ్రామపంచాయతీకి ఫ్రీజర్ బాక్స్ ను అందజేసిన మాజీ సర్పంచ్ దంపతులు 
పచ్చిరొట్ట విత్తనాలను పక్కదారి.. నలుగురు వ్యవసాయ అధికారులు సస్పెండ్
ప్రతి శుక్రవారం డ్రై డే విధానం పాటించాలి
జూన్ 9వ తేదిన జరుగనున్న గ్రూప్ –I ప్రిలిమినరీ పరీక్షకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు.