అవగాహనతో ఆర్థరైటిస్ సమస్యలు దూరం..
లక్షణాలు కనిపించగానే వైద్యులను సంప్రదించాలి..
* కిమ్స్ ఆస్పత్రి రుమటాలజిస్టు డాక్టర్ శరత్ చంద్రమౌళి * ఆర్థరైటిస్‌పై అవగాహన నడక * ముఖ్య అతిథులుగా డైరెక్టర్ మారుతి, యాంకర్ సౌమ్య, నటుడు కార్తీక్ రత్నం, నిర్మాత యాదరిగి రాజు
అవగాహనతో ఆర్థరైటిస్ సమస్యలు దూరం
* లక్షణాలు కనిపించగానే వైద్యులను సంప్రదించాలి
* కిమ్స్ ఆస్పత్రి రుమటాలజిస్టు డాక్టర్ శరత్ చంద్రమౌళి
* ఆర్థరైటిస్‌పై అవగాహన నడక
* ముఖ్య అతిథులుగా డైరెక్టర్ మారుతి, యాంకర్ సౌమ్య, నటుడు కార్తీక్ రత్నం, నిర్మాత యాదరిగి రాజు
హైదరాబాద్, అక్టోబర్ 8, 2023: సరైన అవగాహన ఉంటే ఆర్థరైటిస్ వల్ల వచ్చే సమస్యలు చాలావరకు దూరం అవుతాయని, ఈ విషయంలో వైద్యుల సూచనలను పాటిస్తూ ఎప్పటికప్పుడు తగిన పరీక్షలు చేయించుకుంటే ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని కిమ్స్ ఆస్పత్రికి చెందిన రుమటాలజిస్టు డాక్టర్ శరత్ చంద్రమౌళి అన్నారు. నెక్లెస్ రోడ్డులోని ఆదివారం ఆర్థరైటిస్ అవగాహన నడక నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ శరత్ చంద్రమౌళి మాట్లాడుతూ, ఆర్థరైటిస్ ఏ వయసు వారికైనా రావచ్చని, అది వచ్చినంత మాత్రాన ఎలాంటి ఇబ్బందీ పడాల్సిన అవసరం లేదని చెప్పారు. కేవలం జీవనశైలిలో కొద్దిపాటి మార్పులు చేసుకుంటూ, వైద్యులు సూచించిన మందులు వాడుతుంటే ఆర్థరైటిస్ ఇబ్బందులు చాలావరకు దూరం అవుతాయని చెప్పారు. అయితే, ప్రధానంగా సమాజంలో ఆర్థరైటిస్‌పై పోరాడాలన్న ఒక స్ఫూర్తి రావాలని తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మందికి ఆర్థరైటిస్ సమస్య ఉంది. అయినా, ఇప్పటికీ దానిపై పూర్తిస్థాయి విజయం సాధించడం సాధ్యం కాలేదు. అలాగే చాలామంది దాని గురించి బయటకు చెప్పుకోలేకపోతున్నారు. ఈ మౌనాన్ని ఛేదించాలన్న ఉద్దేశంతోనే ఈ నడక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దీనిద్వారా ముందుగా అందరికీ ఈ సమస్యపై అవగాహన పెంచి, స్ఫూర్తినిచ్చి, అందరూ దీని గురించి చర్చించేలా చేశారు. ఆర్థరైటిస్‌ను నివారించడం ఎలా, ఒకవేళ వస్తే ఏం చేయాలి, ముందుగా గుర్తించాల్సిన ప్రాముఖ్యం ఏంటన్నది అందరికీ వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు వైద్యులు, కళాశాల విద్యార్థులు, ఐటీ ఉద్యోగులు పాల్గొని ఆర్థరైటిస్ ప్రాధాన్యంపై అవగాహన పొందారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కిమ్స్ ఆస్పత్రుల ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బి. భాస్కర్ రావు, డైరెక్టర్ మారుతి దాసరి, యాంకర్ సౌమ్య, నటుడు కార్తీక్ రత్నం, నిర్మాత యాదగిరి రాజు, బద్రుకా కళాశాల కార్యదర్శి శ్రీ కృష్ణ బద్రుకా హాజరయ్యారు.
ఉదయం ఆరు గంటలకు రిజిస్ట్రేషన్లు ప్రారంభించి, 6.30 గంటలకు నడక మొదలుపెట్టారు. 7 గంటల తర్వాత.. ఇప్పటికే ఆర్థరైటిస్ వచ్చిన వారు ఎప్పటికప్పుడు తగిన మందులు వాడుతూ, జీవనశైలి మార్పులు చేసుకుని విజయవంతంగా దాన్ని అధిగమించిన పలువురు తమ విజయగాధలను వివరించారు. 7.30 గంటల నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. 9 గంటల తర్వాత కార్యక్రమం ముగిసింది.
Comment List