పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు.. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
దేశంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కీలక నిర్ణయం తీసుకుంది. జనవరి 3 నుంచి పిల్లలకు వ్యాక్సినేషన్ ఇస్తామని ప్రధాని మోదీ ప్రకటించారు. 15 నుంచి 18 ఏళ్ల లోపువారికి కొవిడ్ టీకాలు వేయనున్నట్లు తెలిపారు. 60 ఏళ్లు పైబడినవారికి వచ్చే నెల 10 నుంచి బూస్టర్ డోసులు ఇవ్వనున్నట్లు తెలిపారు. మరోవైపు రెండేళ్ల పిల్లలకూ వ్యాక్సిన్ కోసం కసరత్తు జరుగుతోంది. ఇప్పటికే దీనిపై ప్రయోగాలు జరిపిన భారత్ బయోటెక్… దీనికి సంబంధించిన సమాచారాన్ని […]
దేశంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కీలక నిర్ణయం తీసుకుంది. జనవరి 3 నుంచి పిల్లలకు వ్యాక్సినేషన్ ఇస్తామని ప్రధాని మోదీ ప్రకటించారు. 15 నుంచి 18 ఏళ్ల లోపువారికి కొవిడ్ టీకాలు వేయనున్నట్లు తెలిపారు. 60 ఏళ్లు పైబడినవారికి వచ్చే నెల 10 నుంచి బూస్టర్ డోసులు ఇవ్వనున్నట్లు తెలిపారు.
మరోవైపు రెండేళ్ల పిల్లలకూ వ్యాక్సిన్ కోసం కసరత్తు జరుగుతోంది. ఇప్పటికే దీనిపై ప్రయోగాలు జరిపిన భారత్ బయోటెక్… దీనికి సంబంధించిన సమాచారాన్ని కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థకు అందించింది. దీనిపై విశ్లేషించిన నిపుణుల కమిటీ సిఫార్సుతో… భారత్ బయోటెక్ కోవాక్సిన్ టీకాకు డీసీజీఐ అనుమతి ఇచ్చింది.
About The Author

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Comment List