టీఎస్​పీఎస్సీ నిర్వహించే గ్రూప్​-2 పరీక్ష వాయిదా.. తీవ్ర మనస్తాపంతో అభ్యర్థిని ఆత్మహత్య?

బిక్కాజిపల్లి గ్రామంలో ముగిసిన ప్రవళిక అంత్యక్రియలు.. ఆ నోట్ లో ఎం రాసిందో చూడండి

By Teja
On
టీఎస్​పీఎస్సీ నిర్వహించే గ్రూప్​-2 పరీక్ష వాయిదా..  తీవ్ర మనస్తాపంతో అభ్యర్థిని ఆత్మహత్య?

వరంగల్ జిల్లాకు చెందిన ప్రవల్లికి పోటీ పరీక్షల కోసం అశోక్ నగర్‌లో ఉంటూ ప్రిపేర్ అవుతోంది..తాజాగా, గ్రూప్ 2 పరీక్ష మరోసారి వాయిదా పడటంతో మనస్తాపానికి గురైన ప్రవల్లిక ఆత్మహత్య చేసుకుందని ఫ్రెండ్స్‌ చెబుతున్నారు.. సూసైడ్‌ నోట్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు..ప్రవళిక మృతితో ఆమె కుటుంబం విషాదంలో మునిగిపోయింది.

హైదరాబాద్​లోని అశోక్​నగర్​లో బృందావన్​ లేడీస్​ హాస్టల్​లో ఉంటూ ప్రవల్లిక(23) గ్రూప్​-2 పోటీ పరీక్షలకు సిద్ధమవుతోంది. ఎన్నికల కారణంగా గ్రూప్​-2 పరీక్ష వాయిదా పడడంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన యువతి.. హాస్టల్​లోని తన రూంలో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. విషయం తెలుసుకున్న తోటి విద్యార్థులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఈ క్రమంలో ఘటనాస్థలానికి చిక్కడపల్లి పోలీసులు చేరుకున్నారు. అక్కడ నుంచి మృతదేహాన్ని తరలించే క్రమంలో భారీ ఎత్తున విద్యార్థులు అక్కడకు చేరుకున్నారు.Pravallika-Suicide-letter-over-TSPSC-exam-delay-at-Hostel

క్షమించండి అమ్మా : "నన్ను క్షమించండి అమ్మా! నేను చాలా నష్టజాతకురాలిని.. నా వల్ల మీరు ఎప్పుడూ బాధపడుతూనే ఉన్నారు. ఏడవకండి అమ్మా.. జాగ్రత్తగా ఉండండి. మీకు పుట్టడం నా అదృష్టం అమ్మా.. నన్ను కాళ్లు కింద పెట్టకుండా చూసుకున్నారు.. మీకు నేను చాలా అన్యాయం చేస్తున్నా.. నన్ను ఎవరూ క్షమించరు. మీ కోసం నేను ఏం చేయలేపోతున్నా అమ్మా.. ప్రణీ అమ్మానాన్న జాగ్రత్త! అంటూ ప్రవల్లిక రాసిన సూసైడ్​ నోట్​ వాట్సాప్​ గ్రూపుల్లో చక్కర్లు కొడుతుంది.
Views: 10

About The Author

Post Comment

Comment List

Latest News

ఆప్యాయత చిరునామా అమ్మ .. ఆప్యాయత చిరునామా అమ్మ ..
అమ్మకదిలే దైవం అమ్మ హృదయమే కోవెల అమ్మ ఆప్యాయత చిరునామా అమ్మ అనురాగం వీలునామ అమ్మరెండు అ..క్షరాల పరవశం అమ్మపెదవే పలికిన తీయని మాటే అమ్మతేనె లొలికే...
సమాజ హిత "విజయ"గర్వం...
జిల్లాలో బాలికల, విద్యార్థినిల, మహిళల కు ‘సంగారెడ్డి జిల్లా పోలీసు షీ-టీమ్స్ రక్షణ’.
నిందితులకు న్యాయస్థానం ముందు శిక్ష పడినప్పుడే, ప్రజలలో పోలీసులపై నమ్మకం పెరుగుతుంది.
ఇస్నాపూర్ లో చిరు వ్యాపారులను 'ఛిద్రం' చేస్తున్న తై -బజార్.!!!
అక్రమ గంజాయి రవాణా పై సంగారెడ్డి జిల్లా పోలీసుల ఉక్కు పాదం.
మిల్లుల వద్ద ధాన్యం దిగుమతిలో జాప్యానికి తావులేకుండా చర్యలు.