వైసీపీ ప్రభుత్వాన్ని మరొక సారి గెలిపించుకుందాం: మంత్రి సురేష్

By Khasim
On
వైసీపీ ప్రభుత్వాన్ని మరొక సారి గెలిపించుకుందాం: మంత్రి సురేష్

పెద్దారవీడు మండలంలోని గోబ్బురు గ్రామములో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ కు గ్రామ ప్రజలు,నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. ప్రజల సమస్యలు తెలుసుకోవడానికే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని మంత్రి సురేష్ అన్నారు.ప్రజలకు అందిస్తున్న సచివాలయ సేవల గురించి ప్రజల ద్వారా ఆరాతీశారు.సచివాల సిబ్బంది బాధ్యతతో విధులు నిర్వహించి ప్రజల నుండి మన్నలను పొందే విధంగా విధులు నిర్వహించాలన్నారు. సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజల గడప వద్దకే ప్రభుత్వ సేవలు అందిస్తున్నాయి అన్నారు. ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగి ప్రజలకు జవాబుదారి తనంతో పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలి అన్నారు. సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకొని వారి సమస్యలను మరింత వేగవంతంగా పరిష్కారానికై కృషి చేయాలని సచివాలయం సిబ్బంది, అధికారులను మంత్రి సూచించారు.గ్రామంలో ఇంటింటిని సందర్శించి  ప్రభుత్వం చేసిన సంక్షేమం గురించి వివరిస్తూ వారి యోగక్షేమాలని అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో ఏ విధమైన సమస్యలు ఉన్నాయి, వాలంటరీ సచివాలయ సిబ్బంది వ్యవస్థ ఎలా ఉంది సరిగ్గా పని చేస్తున్నారా లేదా అని గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు.అర్హులైన ప్రతి ఒక్కరికి పధకాలు ఇస్తున్న సీఎం జగన్ మోహన్ రెడ్డి ని మరొక సారి గెలిపించుదాం అని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ, జెడ్పిటిసి, మండల కన్వీనర్, సచివాలయం కన్వీనర్,వైసీపీ కార్యకర్తలు, గృహ సారదులు ,మండల స్థాయి అధికారులు,సచివాలయం సిబ్బంది, వాలంటరీ లు తదితరులు పాల్గొన్నారు.IMG-20231014-WA0579

Views: 8
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

పాయకరావుపేటలో ఎవరు? పాయకరావుపేటలో ఎవరు?
వ్యతిరేకత ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలపై జగన్ వేటు పాయకరావుపేటలో గొల్ల బాబూరావుకు నో ఛాన్స్ ఏపీ మాల కార్పొరేషన్ చైర్ పర్సన్ అమ్మాజీకి ఛాన్స్
తెలంగాణలో సీఎం ఎవరు అని
ఉత్తమ యువ రాజకీయ విశ్లేషకుడిగా
డా.బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు
ఘనంగా హోంగార్డ్స్ రేజింగ్ డే వేడుకలు
మహా నగరంలో కల్తీ మాయగాళ్ళు
కంగ్టి లో ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలు