తెలంగాణలో కాకరేపుతోన్న మునావర్‌ ఫరూఖీ టూర్‌

On

వివాదాస్పద స్టేండప్‌ కమిడియన్‌ మునావర్‌ ఫరూఖీ టూర్‌.. తెలంగాణలో కాకరేపుతోంది. కామెడీ షోలలో హిందూ దేవతలను అవమానిస్తున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న మునావర్‌.. జనవరి 9వ హైదరాబాద్‌లో షో నిర్వహిస్తుండటంపై హిందూ సంఘాలు భగ్గుమంటున్నాయి. ఇప్పటికే 16 రాష్ట్రాలు నిషేధించిన వ్యక్తిని తెలంగాణలో ఎలా షో నిర్వహించుకోనిస్తున్నారని.. ప్రభుత్వంపై ఫైర్‌ అవుతున్నాయి. జనవరిలో మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో మునావర్‌ అరెస్ట్‌ అయ్యారు. హిందూ దేవుళ్లను అవమానిస్తూ మాట్లాడారని.. బీజేపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదుతో అతన్ని అరెస్ట్‌ చేశారు. ఈ కేసులో […]

వివాదాస్పద స్టేండప్‌ కమిడియన్‌ మునావర్‌ ఫరూఖీ టూర్‌.. తెలంగాణలో కాకరేపుతోంది. కామెడీ షోలలో హిందూ దేవతలను అవమానిస్తున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న మునావర్‌.. జనవరి 9వ హైదరాబాద్‌లో షో నిర్వహిస్తుండటంపై హిందూ సంఘాలు భగ్గుమంటున్నాయి. ఇప్పటికే 16 రాష్ట్రాలు నిషేధించిన వ్యక్తిని తెలంగాణలో ఎలా షో నిర్వహించుకోనిస్తున్నారని.. ప్రభుత్వంపై ఫైర్‌ అవుతున్నాయి.

జనవరిలో మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో మునావర్‌ అరెస్ట్‌ అయ్యారు. హిందూ దేవుళ్లను అవమానిస్తూ మాట్లాడారని.. బీజేపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదుతో అతన్ని అరెస్ట్‌ చేశారు. ఈ కేసులో 37 రోజులు జైల్లో ఉన్న మునావర్‌.. సుప్రీంకోర్టు బెయిల్‌ ఇవ్వడంతో బయటకొచ్చారు. అప్పటి నుంచి హిందూ సంఘాలు, బీజేపీ నేతలు.. మునావర్‌ షోలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొద్ది నెలల క్రితం.. బెంగళూర్‌, గుర్‌గావ్‌, రాయ్‌పూర్‌, సూరత్‌, అహ్మదాబాద్‌, వడోదర, గోవా, ముంబైలలో మునావర్‌ ఫరుఖీ షోలు రద్దయ్యాయి. హిందూ సంఘాల హెచ్చరికలతో నవంబర్‌ 28న బెంగళూర్‌లో జరగాల్సిన షో కూడా రద్దయ్యింది.

మునావర్‌ చుట్టూ ఇంత వివాదం జరుగుతున్న నేపథ్యంలోనే.. మంత్రి కేటీఆర్‌, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌.. హైదరాబాద్‌, భోపాల్‌లలో షోలు చేసుకోవాడానికి ఆహ్వానించారు. ఇప్పుడిదే హిందూ
సంఘాల ఆగ్రహానికి కారణమవుతోంది. మరీ హైదరాబాద్‌లో షో జరుగుతుందో లేక మిగితా నగరాలలో మాదిరిగానే రద్దవుతుందో చూడాలి.

Views: 3
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

ఉద్యోగుల పొట్టకొట్టి.. బోర్డు తిప్పేసిన హాస్పిటల్! ఉద్యోగుల పొట్టకొట్టి.. బోర్డు తిప్పేసిన హాస్పిటల్!
ఉద్యోగుల పొట్టకొట్టి.. బోర్డు తిప్పేసిన హాస్పిటల్! హాస్పటల్ ముందు ఆందోళన చేస్తున్న సిబ్బంది.. రంగారెడ్డి జిల్లా, ఎల్బీనగర్, మే 29, న్యూస్ ఇండియా ప్రతినిధి: ఉద్యోగులకు మూడు...
పంటల వ్యర్థాలను దహనం చేస్తే కేసులు తప్పవు
టిప్పర్ ఒరిగి కలకలం.. తప్పిన పెను ప్రమాదం..
పంట వ్యర్థాలను తగలబెడితే కఠిన చర్యలు
పెద్దవంగరలో రోడ్డు ప్రమాదం
ప్రభుత్వాన్ని కూల్చేద్దాం | Tamil Politics Biggest Twist..! | GeethaMedia Telugu
వెలికట్టలో ఘోర రోడ్డు ప్రమాదం