
కంభం రైల్వే స్టేషన్లో ఆగని రైళ్ళని కూడా ఆపాలని వినతి
On
కంభం న్యూస్ ఇండియా
ప్రకాశం జిల్లా కంభం రైల్వే స్టేషన్ కు వచ్చిన గుంటూరు డివిజనల్ రైల్వే మేనేజర్ రామకృష్ణ ను కంభం మండల మాజీ సైనికుల సంక్షేమ సంఘం అధ్యక్షులు షేక్ వలి, కార్యదర్శి టి అంకయ్య, కె సిహెచ్ పుల్లయ్య, జి పాండు, ఎన్ పోలయ్య, మస్తాన్ వలి, ఏ కొండయ్య, పీటర్, చెన్నయ్య మర్యాదపూర్వకంగా కలిశారు. డివిజనల్ రైల్వే మేనేజర్ రామకృష్ణకు కంభం రైల్వే స్టేషన్ లో ఆగని ట్రైన్స్ ను కూడా ఆపాలని వినతి పత్రం ద్వారా అందచేశారు.అలానే చెన్నై వరకు ఈ ప్రాంతం నుండి ట్రైన్స్ ను ఏర్పాటు చేయమని విన్నవించారు.డివిజనల్ రైల్వే మేనేజర్ రామకృష్ణ సాధ్యమైనంత త్వరలో పరిశీలించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Views: 136
About The Author
Related Posts
Post Comment
Latest News

30 Nov 2023 10:45:17
యాదాద్రి భువనగిరి జిల్లా మండలంలోని పులిగిల్ల గ్రామంలో భారతీయ స్వదేశ్ కాంగ్రెస్ పార్టీ భువనగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పల్లెర్ల మైసయ్య తమ స్వంత గ్రామమైన పులిగిల్లలో...
Comment List