ఏమన్నా.. నియోజకవర్గంలో పార్టీని దెబ్బ తీస్తున్నావు?

పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్లబాబూరావును ప్రశ్నించిన  సీఎం జగన్

On
ఏమన్నా.. నియోజకవర్గంలో పార్టీని దెబ్బ తీస్తున్నావు?

కేడర్ ను నిర్లక్ష్యం చేస్తున్నావంటూ జగన్ ఆగ్రహం


సీఎం జగన్ విశాఖ జిల్లా పర్యటనలో పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్లబాబూరావుకు చుక్కెదురైంది. సీఎం జగన్ ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరయ్యారు.ఈసారి టికెట్ రాదని తెలియడంతో.. చివరి ప్రయత్నంగా సీఎంను కలిసేందుకు ప్రయత్నించారు. సర్వేలు నెగటివ్ గా రావడంతో పార్టీ టికెట్ రాదని తెలియడంతో ఇప్పటివరకు అంటీముట్టనట్లుగా ఉన్న ఎమ్మెల్యే ముఖ్యమంత్రిని  కలవడంతో..జగన్ అడిగిన ప్రశ్నకు షాక్ అయ్యారు.  ఏమన్నా నియోజకవర్గంలో పార్టీని దెబ్బతీస్తున్నావు..కార్యకర్తలను ఎందుకు పట్టించుకోవడం లేదంటూ జగన్ ప్రశ్నించడంతో నోటమాట రాలేదు. వెంటనే తేరుకుని చిరునవ్వు నవ్వినా సీఎం జగన్ మాత్రం సీరియస్ గానే.. కేడర్ ను  నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదంటూ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. వ్యక్తి కంటే పార్టీ ముఖ్యమని.. కార్యకర్తల అభిప్రాయానికి అనుగుణంగా నిర్ణయం ఉంటుందని చెప్పారు.  దీంతో టికెట్ కొత్తవారికే ఇస్తున్నారని.. క్లీన్ ఇమేజ్ నాయకులకు ఇస్తారని.. టీడీపీ అభ్యర్ధిని ఎదుర్కొవాలంటూ బలమైన మహిళా నాయకురాలు అయితేనే అది సాధ్యమని హైకమాండ్ భావిస్తోంది. ఏపీ ఎస్సీ మాల కార్పొరేషన్ ఛైర్ పర్సన్ పెదపాటి అమ్మాజీకి టికెట్ కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తోంది. త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

BABU RAO

Views: 51

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

రూ.1,072 కోట్ల విలువైన కొత్త పరిశ్రమలకు శంకుస్థాపన చేసిన సీఎం జగన్ రూ.1,072 కోట్ల విలువైన కొత్త పరిశ్రమలకు శంకుస్థాపన చేసిన సీఎం జగన్
ముఖ్య‌మంత్రి క్యాంపు కార్యాల‌యంలో రూ. 1,072 కోట్ల విలువైన కొత్త పరిశ్రమలకు సీఎం జగన్ బుధవారం వ‌ర్చువ‌ల్‌గా శంకుస్థాపన చేశారు. వీటిద్వారా 21,079 మందికి ఉపాధి లభిస్తుంది....
ఆడుదాం ఆంధ్ర- ఈ ఆట మనందరిది- ఒలింపిక్ పతకాల విజేత పీవీ సింధు
అండగా ఉంటా.... సమస్యలు తీరుస్తా....
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం దక్కించుకునే అవకాశాలు చాలా ఎక్కువ శాతం ఉంది
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ దాటితే
ఎంపీ వద్దిరాజు నాగుల్ మీరా దర్గా సందర్శన
ఘనంగా బిఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ