ఎన్నికల్లో వెనక్కి తగ్గొద్దు అన్న: పవన్ కళ్యాణ్ కు తెలంగాణ నేతల వినతి

On
ఎన్నికల్లో వెనక్కి తగ్గొద్దు అన్న: పవన్ కళ్యాణ్ కు తెలంగాణ నేతల వినతి

తెలంగాణ శాసన సభ ఎన్నికలలో జనసేన పోటీ చేయాల్సిందేనని జనసేన తెలంగాణ నాయకులు పవన్ కళ్యాణ్‌కు విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌లోని జనసేన తెలంగాణ రాష్ట్ర శాఖ కార్యాలయంలో మంగళవారం రాత్రి జనసేన నాయకులతో పవన్ కళ్యాణ్ సమావేశం అయ్యారు.

తెలంగాణ రాష్ట్రంలో వచ్చేఎన్నికలకు జనసేన పార్టీ రెడీ అయ్యింది. తెలంగాణా ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందని పవన్ కళ్యాణ్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక తాజాగా ఎన్నికల బరిలోకి దిగడానికి ఇప్పటి నుంచే సన్నాహాలు ప్రారంభించింది. వచ్చే ఎన్నికలలో 32 స్థానాలలో పోటీ చేయడానికి జనసేన సిద్ధమైంది.

హైదరాబాద్లోని జనసేన తెలంగాణ రాష్ట్ర శాఖ కార్యాలయంలో జనసేన నాయకులతో పవన్ కళ్యాణ్ సమావేశం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న ఎన్నికలపై పవన్ కళ్యాణ్ పోటీ చేయదలుచుకున్న అభ్యర్థుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. అయితే ఈ సందర్భంగా అందరూ అభ్యర్థులు తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయాల్సిందేనని, వెనక్కు తగ్గొద్దు అని పవన్ కళ్యాణ్ కు సూచించారు. ఎన్నాళ్ళ నుండో ఈ అవకాశం కోసం ఎదురుచూస్తున్నామని, ఈ దఫా పోటీ చెయ్యకపోతే తెలంగాణలో పార్టీ ఎదుగుదలను చేతులారా ఆపుకున్నట్టే అని అభిప్రాయపడ్డారు.

పవన్ ఏం అంటున్నారంటే?

అయితే తన మీద ఉన్న ఒత్తిడి వాస్తవమేనని, అయితే నాయకులు, జన సైనికులు, వీర మహిళల అభిప్రాయాలను గౌరవిస్తానని పవన్ కళ్యాణ్Screenshot 2023-10-18 153416 పేర్కొన్నారు. సరైన నిర్ణయం తీసుకోవటానికి రెండు రోజుల సమయం అవసరం అని తెలిపారు.


Views: 35

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News