CongTrsPk : కాంగ్రెస్.. టీఆర్‌ఎస్.. ఓ పీకే..!
CongTrsPk : దేశ రాజకీయాల్లో కీలకంగా మారాలని భావిస్తున్న సీఎం కేసీఆర్, ప్రశాంత్ కిషోర్‌ల భేటీపై రాజకీయాలలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. శనివారం, ఆదివారం దాదాపు రెండు రోజుల పాటు కేసీఆర్ తో పీకే జరిపిన సమావేశంలో రాష్ట్ర రాజకీయాలు, జాతీయ రాజకీయాలపై చర్చించారు. ఈ సమావేశంలో బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాటుపై కూడా చర్చించినట్లు తెలుస్తోంది. అయితే ప్రాంతీయ పార్టీలన్నింటిని ఏకతాటిపైకి తెచ్చేందుకు ఇప్పటికే పలు రాష్ట్రాల్లో పర్యటించారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఐతే పలువురు ప్రాంతీయ […]
CongTrsPk : దేశ రాజకీయాల్లో కీలకంగా మారాలని భావిస్తున్న సీఎం కేసీఆర్, ప్రశాంత్ కిషోర్‌ల భేటీపై రాజకీయాలలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. శనివారం, ఆదివారం దాదాపు రెండు రోజుల పాటు కేసీఆర్ తో పీకే జరిపిన సమావేశంలో రాష్ట్ర రాజకీయాలు, జాతీయ రాజకీయాలపై చర్చించారు. ఈ సమావేశంలో బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాటుపై కూడా చర్చించినట్లు తెలుస్తోంది.
అయితే ప్రాంతీయ పార్టీలన్నింటిని ఏకతాటిపైకి తెచ్చేందుకు ఇప్పటికే పలు రాష్ట్రాల్లో పర్యటించారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఐతే పలువురు ప్రాంతీయ పార్టీల నేతలు కాంగ్రెస్ పార్టీ లేకుండా జాతీయ స్థాయిలో కూటమి సాధ్యం కాదని చెప్పారు. తర్వాత ఫాం హౌస్ వేదికగా ప్రశాంత్ కిషోర్, ప్రకాష్ రాజ్‌తో భేటీ అయిన కేసీఆర్… ఆ సమావేశంలో తెలంగాణ అభివృద్ధిని దేశ ప్రజలకు తెలిసేలా ఒక కార్యాచరణ రూపొందించాలన్న విషయాలపై చర్చించారు
ఫాంహౌస్‌లో ప్రశాంత్ కిషోర్‌తో భేటీ తర్వాత TRS కోసం పని చేసేందుకు ఒప్పందం జరిగింది. TRSతో పాటు దేశ రాజకీయాల్లో కలిసివచ్చే పార్టీలతో పీకే కలిసి పని చేస్తారని కేసీఆర్ ప్రకటించారు. ఐతే తాజాగా కాంగ్రెస్ అధిష్టానంతో పీకే వరుస భేటీలతో TRSతో పీకే పని చేస్తాడా లేదా అనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా జరిగింది.
కాంగ్రెస్ అధిష్టానంతో భేటీ తర్వాత నేరుగా హైదరాబాద్ వచ్చిన ప్రశాంత్ కిషోర్ సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో చర్చల విషయం కూడా కేసీఆర్‌కు వివరించారు ప్రశాంత్ కిషోర్. కాంగ్రెస్ అధిష్టానానికి ఇచ్చిన ప్రజంటేషన్ KCRకు వివరించారు.
About The Author

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Comment List