బిల్లులు లేకుండా అమ్మకాలు సాగిస్తున్న బియ్యం సీజ్

On
బిల్లులు లేకుండా అమ్మకాలు సాగిస్తున్న బియ్యం సీజ్

బేస్తవారిపేట న్యూస్ ఇండియా

ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలంలో అది పేరు మోసినటువంటి రైస్ మిల్ అలాంటి రైస్ మిల్లు తమకు ప్రజా ప్రతినిధుల అండదండలు ఉన్నాయి అధికారులు ఏమి చేస్తారులే అనుకున్నారో ఏమో ఆ మిల్లు యజమాని మార్కాపూర్ డివిజన్లోనే రైస్ మిల్లు అత్యధిక టెక్నాలజీతో వడ్లను బియ్యం గా మార్చుతూ ఇక్కడి నుండి హోల్ సీల్ గా మరియు రిటైల్ గా అమ్మకాలు సాగిస్తూ ఉంటారు. గత నాలుగు సంవత్సరాల నుండి ఈ మిల్లు లోఎలాంటి బిల్లులు లేకుండా వడ్లను బియ్యముగా మార్చి అధిక మొత్తంలో అమ్మకాలు సాగిస్తూ ఉంటారు. ఇక్కడే అధికారులు పప్పులో కాలేసినట్లయింది. గత కొన్ని సంవత్సరాలుగా నంద్యాల, కర్నూల్, దర్శి, త్రిపురాంతకం తదితర ప్రాంతాల్లో అధిక మొత్తంలో వడ్లు కొనుగోలు చేసే రైస్ మిల్ యజమాని అక్కడ కొనుగోలు చేసిన వడ్లు కొనుగోలు చేసి అక్కడ నగదు చెల్లించిన బిల్లులు కానీ, ఇక్కడ బియ్యం అమ్మకాలు చేసినటువంటి బిల్లులు గాని, రోజువారి బిల్లులు లేకపోవడం ఆశ్చర్యకరం. ప్రభుత్వానికి టాక్స్ రూపేనా చెల్లించాల్సిన నగదు ఎక్కడ చెల్లించినట్లు రసీదులు లేకపోవడంతో ఒంగోలు డిఎస్ఓ సురేష్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. జంక్షన్ లోని వాసవి రైస్ మిల్లులో మంగళవారం అర్ధరాత్రి ఒంగోలు డిఎస్ఓ సురేష్, ఎన్ఫోర్స్మెంట్ డీటీ బొంతల ప్రసాద్, పిడతల గంగిరెడ్డి, అనిల్ కుమార్ లు మిల్లును తనిఖీచేయగా ఎలాంటి బిల్లులు లేకపోవడంతో వారు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. నిత్యము ఈ మిల్లు నుండి ఇతర ప్రాంతాలకు కర్నూలుసోనా బియ్యాన్ని 25 కేజీల టిక్కీలను ఇతర ప్రాంతాలకు వాహనాల ద్వారా ఇతర ప్రాంతాలకు తరలిస్తూ ఉంటారు. ఈ మిల్లు ద్వారా ఇతర షాపులకు వెళ్లే బియ్యానికి మిల్లులో కానీ షాపులకు వేసినప్పటికీ అక్కడ బిల్లులు కానీ లేకపోవడంతో మిల్లులో స్టాక్ ఉన్నటువంటి 4450

బస్తాల (25కేజీల) బియ్యాన్ని ఒంగోలు డిఎస్ఓ మరియు సిబ్బంది సీజ్ చేసి 6ఎ కేసు నమోదు చేసినట్టు తెలిపారు. ఇన్ని రోజులు బిల్లులు లేకుండా బియ్యాన్ని విక్రయిస్తున్న ఆ మిల్లుపై ఎవరు కన్నెత్తి చూడకపోవడం ఆశ్చర్యకరం. ఈ విషయంపై ఒంగోలు డిఎస్ఓ సురేష్ ను పెన్ పవర్ విలేఖరి వివరణ కోరగా వాసవి రైస్ మిల్లు తనిఖీలు చేసిన మాట వాస్తవమేనని బిల్లులు లేకుండా నిర్వహించినటువంటి 25 కేజీల కర్నూల్ సోనా బియ్యాన్ని 4 వేల 450 టిక్కీలను సీజ్ చేసామని అధికారులు తెలిపారు.IMG-20231018-WA0440

Views: 230

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

ఘనంగా కాంగ్రెస్ నాయకుడు కంచి రాములు జన్మదిన వేడుకలు ఘనంగా కాంగ్రెస్ నాయకుడు కంచి రాములు జన్మదిన వేడుకలు
ఘనంగా కాంగ్రెస్ నాయకుడు కంచి రాములు జన్మదిన వేడుకలు    యాదాద్రి కేక్ కట్ చేస్తున్న కాంగ్రెస్ నాయకులు భువనగిరి జిల్లా వలిగొండ మండలం లోని పులిగిల్ల గ్రామం...
వలిగొండ ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ఎన్నిక
మర్రి"తో "మాచన" అనుభందం...
ధాన్యం సేకరణ ఓ క్రతువు..
దాహార్తిని తీర్చండి
మినీ మేడారం జాతరకు  ప్రత్యేక బస్సు
డొమెస్టిక్ సిలిండర్లు హోటళ్ళ లో ఎలా ఉన్నాయ్..