ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన యువకులకు సన్మానం చేసిన తుంగతుర్తి మాజీ ఎంపిటిసి కీర్తి లక్ష్మీ ఎంకన్న గౌడ్.

యువకులు ఆదర్శంగా తీసుకోవాలని ఆదిమల్ల శ్రీనివాస్

On
ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన యువకులకు సన్మానం చేసిన తుంగతుర్తి మాజీ ఎంపిటిసి కీర్తి లక్ష్మీ ఎంకన్న గౌడ్.

న్యూస్ ఇండియా తెలుగు,అక్టోబర్ 22 (నల్గొండ జిల్లా స్టాపర్ )కేతేపల్లి మండల పరిధిలోని తుంగతుర్తి గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న నిరుపేదల పిల్లలు ఆర్మీ మరియు పోలీస్ శాఖలలో ఉద్యోగాలు సాధించారు. భయ్యా మహేష్ ఆర్మీ పోలీస్, లకపాక అశోక్ పోలీస్ కానిస్టేబుల్ లను ఉద్యోగాలను సాధించారు.వీరికి గ్రామ మాజీ ఎంపీటీసీ కీర్తి వెంకన్న , ఆదిముల్లా శ్రీనివాస్ ఆత్మీయంగా సన్మానించడం జరిగింది. అనంతరం ఆదిముల్లా శ్రీనివాస్ గారు మాట్లాడుతూ ...గతాన్ని ఒకసారి మననం చేసుకుంటే ఏ ఊరిలోనైతే ఉన్నత పాఠశాలలు ఉన్నాయో అక్కడ ఉద్యోగుల శాతం ఎక్కువగా ఉన్నదని అందులో నిరుపేదలు సైతం ఉన్నత ఉద్యోగాలు సాధించగలరని తుంగతుర్తి ప్రభుత్వ పాఠశాల రుజువు చేసింది. మునుముందు మరెన్నో ఉద్యోగాలు సాధించాలని ఇలాంటి యువకులను ఆదర్శంగా తీసుకోవాలని తెలియజేశారు.

Views: 38

About The Author

Post Comment

Comment List

Latest News